ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్‌లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 10:44 AM IST
ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్‌లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్‌లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని నమ్మకంగా ఉన్న వారు ఫెయిల్ అయ్యారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విచిత్రం చోటు చేసుకుంది.
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

జిల్లా టాపర్ గా నిలిచిన పేదింటి విద్యార్థినికి అన్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లాలో 2018లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా టాపర్ గా నిలిచిన నవ్య అనే విద్యార్థినికి.. సెకండియర్ లో తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు చూసి నవ్య, ఆమె తల్లిదండ్రులు షాక్ తిన్నారు. చింతగూడెం గ్రామానికి చెందిన సత్తెన్న కూతరు నవ్యకు ఫస్టియర్ లో(సీఈసీ) 467 మార్కులు వచ్చాయి. సెకండియర్ లో కూడా అవే మార్కులు వస్తాయని ఆశించింది.
Also Read : నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. తెలుగులో మాత్రం సున్నా మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యింది. మొత్తంగా తనకు 825 మార్కులు వచ్చాయని, తెలుగులో తనకు 99 మార్కులు వస్తాయని ఆశిస్తే.. సున్నా మార్కులు వచ్చాయని నవ్య వాపోయింది. దీనిపై కాలేజీలో ఆరా తీయగా.. 99 మార్కులకు బదులు జీరో వేసి ఉంటారని కాలేజీ ప్రిన్సిపాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ ఫలితంతో నవ్య ఆమె కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురయ్యారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు.

నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, పేరెంట్స్ ధర్నా చేస్తున్నారు. బోర్డు కార్యదర్శిని ఘెరావ్ చేశారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారి తీశాయి. కొన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావడం.. మరో సబ్జెక్టులో ఫెయిల్ కావడం.. పరీక్షలకు హాజరైనా.. ఆబ్సెంట్ అయినట్లు మెమోలో ఉండడంతో విద్యార్థులు షాక్ తిన్నారు. ఇంటర్ బోర్డు ఎదుట తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన.. ఇలా అన్నింటిలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read : వీడియో వైరల్: రాంగ్‌రూట్‌లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..