స్కూల్ నుంచి ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు

స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 02:08 AM IST
స్కూల్ నుంచి ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు

స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.

స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇంటర్‌లో యూట్యూబ్ పాఠాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు… త్వరలో స్కూల్ లెవల్‌లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెంచడమే లక్ష్యంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.

యూట్యూబ్ పాఠాలతో విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ఆకర్షిస్తున్న ప్రైవేటు యాప్‌లు 
స్కూల్ ఎడ్యుకేషన్‌లో చాలా ప్రైవేటు యాప్‌లు అట్రాక్టివ్ వీడియోలతో… యూట్యూబ్ పాఠాలతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఆకర్షిస్తున్నాయి. వీటికి ఏటా దాదాపుగా 40నుంచి 60వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బైజూస్.. వేదాంత్ వంటి యాప్‌లు పాపులర్‌ అయ్యాయి. ఇటువంటి ప్రయోగమే ప్రభుత్వమే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనన నుంచి వచ్చిందే స్కూల్ టు ఇంటర్ విద్యార్థులకు యూట్యూబ్ పాఠాలు. ఇదే జరుగుతే విద్యార్థులకు పాఠాలను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా… ప్రాక్టికల్‌గా వారికి నచ్చిన కార్టూన్ బొమ్మలతో చెప్పొచ్చని సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు?
యూట్యూబ్‌ పాఠాల కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇంటర్‌ బోర్డ్‌… త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇదే విధానాన్ని పాఠశాల విద్యలో కూడా అమలు చేస్తే మరింత మెరుగైన విద్య అందుతుందనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులున్నారు. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలుకు అవకాశాలుంటాయా లేదా అనే సాధ్యాసాధ్యాల్ని చర్చిస్తున్నారు. వీలైనంత వరకు వచ్చే విద్యాసంవత్సరంలోనే స్కూల్ ఎడ్యూకేషన్‌లో కూడా అమలుకు సిద్ధం కావాలని స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ ఆదేశించినట్టుగా సమాచారం.

ముందస్తుగా టెన్త్ విద్యార్ధులకు యూట్యూబ్ పాఠాలు 
ఈరోజుల్లో విద్యార్ధులు స్కూల్ అవగానే మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారు. అందుకే మొబైబ్‌లో కూడా వారి పాఠాలు కాస్త ఇంట్రెస్టింగ్ చెప్పగలిగితే బాగుంటుందనే ఆలోచనతో అధికారులున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కొన్ని ప్రైవేటు యాప్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నాయి. చాలా స్కూల్స్ లో డిజిటల్ పాఠాలు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క టీసాట్ పాఠాల్ని కూడా విద్యార్ధులకు వినిపిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా టెన్త్ విద్యార్ధులకు యూట్యూబ్ పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే సాద్యాసాధ్యాలపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు చిత్రా రామచంద్రన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.