స్కూలు పిల్లల కోసం కొత్త ఆధార్ కేంద్రాలు

  • Published By: chvmurthy ,Published On : November 22, 2019 / 03:17 AM IST
స్కూలు పిల్లల కోసం కొత్త ఆధార్ కేంద్రాలు

తెలంగాణ  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరు ఆధార్‌ నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్‌ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్లో (ఎంఆర్‌సీ) ఆధార్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. 

కొత్తగా మరో 876 సంచార ఆధార్‌ నమోదు బృందాలను అవసరమైన ప్రతి పాఠశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ మొబైల్‌ బృందాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు.