Supreme Court : నీట్‌ యూజీ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్

నీట్‌ యూజీ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Supreme Court : నీట్‌ యూజీ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Neet

NEET UG exams results : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రాన్స్ టెస్టు (నీట్‌) యూజీ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు విద్యార్థుల కోసం నీట్‌ పరీక్ష ఫలితాలను ఆపడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.

అలాగే ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏని ఆదేశించింది. తమకు తప్పుడు సీరియల్‌ నంబర్లు కలిగిన ప్రశ్నా పత్రాలు, ఆన్సర్‌ షీట్లు ఇచ్చారని వైష్ణవి భూపాలీ, అభిషేక్‌ శివాజీ అనే ఇద్దరు విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

దీంతో వారి కోసం పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అప్పటివరకు ఫలితాలను విడుదల చేయకూడదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరి విద్యార్థుల కోసం 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేయలేమని తేల్చి చెప్పింది. పరీక్షల ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది.