TSPSC Polytechnic Lecturer Recruitment : తెలంగాణా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఎస్/పీజీ/బీఆర్క్‌/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

TSPSC Polytechnic Lecturer Recruitment : తెలంగాణా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

TSPSC Polytechnic Lecturer Recruitment : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఖాళీలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 19 సబ్జెక్టుల్లో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులు 15, బయో-మెడికల్ ఇంజనీరింగ్ పోస్టులు 3, కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు 1, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు 82, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు 24, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు 41, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు 1, ఫుట్ వేర్ టెక్నాలజీ పోస్టులు 5, లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ) పోస్టులు 5, మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు 36, మెటలర్జీ పోస్టులు 5, ప్యాకేజింగ్ టెక్నాలజీ పోస్టులు 3, టెన్నెరీ పోస్టులు 3, టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టులు 1, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ పోస్టులు 4, ఫార్మసీ పోస్టులు 4, జియోలజీ పోస్టులు 1, కెమిస్ట్రీ పోస్టులు 8, ఫిజిక్స్‌ పోస్టులు 5 ఉన్నాయి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఎస్/పీజీ/బీఆర్క్‌/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 4, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ పరిశీలించగలరు.