Admissions : మిలటరీ కాలేజ్ లో 8వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25తో ముగియనున్న తుదిగడువు

ఎంపిక కోసం ప్రత్యేకమైన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 4న నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

Admissions : మిలటరీ కాలేజ్ లో 8వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25తో ముగియనున్న తుదిగడువు

Rimc

Admissions : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC)లో 8వతరగతిలో ప్రవేశాలకు చేపట్టిన దరఖాస్తు ప్రక్రియ తుదిదశకు చేరింది. ఏప్రియల్ 25, 2022తో దరఖాస్తు ప్రక్రియకు గడువు తేది ముగియనుంది. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న అభ్యర్థులు లేదా ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుండి ఏడో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2, 2010 నుంచి జూలై 1, 2011 మధ్య విద్యార్థులు జన్మించి ఉండాలి. 11 నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక కోసం ప్రత్యేకమైన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 4న నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీలో సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఒకవేళ డీడీ అయితే ఈ అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెల్ భవన్, డెహ్రాడూన్ (బ్యాండ్ కోడ్-01576), ఉత్తరాఖండ్ కు పంపాల్సి ఉంటుంది.

పరీక్షా ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఫలితం వచ్చిన 10 రోజుల్లోగా కాలేజ్ లో చేరాల్సి ఉంటుంది. 8వ తరగతిలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థుల బర్త్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్, ప్రస్తుతం చదువుతున్న స్కూల్ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, రెండు పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటోలను సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు వెబ్‌సైట్ rimc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తరగతులు జనవరి 2023 నుంచి ప్రారంభం కానున్నాయి.