ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 03:43 PM IST
ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం

ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్‌ బోర్డ్‌, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్‌ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇంటర్ బోర్డ్‌ క్రాస్‌ చెక్‌ చేయకుండా ఫలితాలను విడుదల చేసిందని త్రిసభ్య కమిటీ తేల్చింది. గ్లోబరినా సంస్థకు ఉన్న అర్హతలపై లోతుగా అధ్యయనం చేసింది. రాబోయే 15 రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో రిపోర్ట్‌లో పొందుపరిచింది.

ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్ పీఎస్సీ ఎండీ వెంకటేశ్వర్ రావు, ప్రొ.నిశాంక్, ప్రొ.వాసన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజులుగా సుదీర్ఘంగా గ్లోబరీనా సీఈవో రాజు, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్, ఓఎస్ డీతోపాటు ఇతర ఉన్నతాధికారులను అనేక విచారణలు చేపట్టిన అనంతరం ఇవాళ రాత్రి 8 గంటలకు నివేదికను పూర్తి చేసింది. ఈ నివేదకను రేపు ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. టెక్నికల్ గా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని కమటీ తేల్చింది. అంతేకాకుండా ఇంటర్ బోర్డు తప్పిదాలు, గ్లోబరీనా సంస్థ టెక్నికల్ గా చాలా ఇబ్బందులకు గురి చేసిందని తేల్చి చెప్పింది. సంస్థ అనేక తప్పిదాలు చేసినట్లుగా రిపోర్టులో రాశారు. ఇంటర్ బోర్డ్‌ క్రాస్‌ చెక్‌ చేయకుండా ఫలితాలను విడుదల చేసిందని సరికాదని రిపోర్టులో అభిప్రాయపడ్డారు.