Bharath : 35 ఏళ్లకే 11% మందికి ఏదో ఒక రోగం..ఆందోళనలో ఆరోగ్యం

మనిషి జీవితంలో 35 ఏళ్లు అంటే చాలా తక్కవే. కానీ 35 ఏళ్లకే అనారోగ్యాలు చుట్టుముడుతున్న పరిస్థితులు. 35 ఏళ్లకే అనేక వ్యాధులుపాలవుతున్న అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి కారణమంటోంది అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) అధ్యయనం నివేదిక.

Bharath : 35 ఏళ్లకే 11% మందికి ఏదో ఒక రోగం..ఆందోళనలో ఆరోగ్యం

Air Pollution

Air pollution is the main cause : ఒకప్పుడు ప్రజలు 100 ఏళ్లు వచ్చినా పూర్తి ఆరోగ్యంగా ఉండేవారు. తరువాత 60 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగానే ఉండేవారు. కానీ ఇప్పుడు యుక్త వయస్సు పూర్తి కాకుండానే అనేక రోగాలపాలవుతున్నారు. దీనికి కారణం జీవనశైలి, తినే ఆహారం..కాలుష్యం ఇలా కారణాలు ఏవైనా 35 ఏళ్లు దాటగానే అనేక వ్యాధులుపాలవుతున్న పరిస్థితి ఉంది. మన దేశంలో ఆరోగ్యం విషయానికొస్తే ఎంతమంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు? అంటే అది చాలా పెద్ద ప్రశ్నే అని చెప్పాలి. ఎందుకంటే ఏటా పెరిగిపోతున్న కాలుష్యం దీనికి కారణమంటోంది అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) అధ్యయనం నివేదిక.

దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏళ్ళు దాటితే చాలు ఏదోక అసాంక్రమిక వ్యాధుల (Infectious diseases) బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యమేనని అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

హైపర్‌టెన్షన్‌, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువ మంది బాధపడతున్నారని వెల్లడైంది. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. అంటే క్యాన్సర్ భూతానికంటే కాలుష్య భూతమే మనుషుల్ని అనారోగ్యానికి గురిచేస్తోందని తెలుస్తోంది. దేశంలోని 21 రాష్ర్టాల్లో 2,33,672 మందిపై సర్వేలో తేలిన విషయాలివి.

అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26 నుంచి 59 ఏళ్ల వారే ఉన్నారు. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలి వస్తున్న మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.