Avoid These Foods : చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను నివారించండి !

వేయించిన ఆహారాలు, డీప్-ఫ్రైడ్ మాంసాలు , చీజ్ స్టిక్స్ వంటి వాటిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి మరియు రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి.

Avoid These Foods : చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను నివారించండి !

High Cholesterol food

Avoid These Foods : మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిలు పెరగటంలో కొన్ని ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆహారాలలో అధిక స్థాయి సంతృప్త మరియు ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటే మన శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ధమనులను సంకుచితం చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గేలా చేస్తుంది. చివరికి అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని నివారించకుంటే, అది గుండెపోటులు, స్ట్రోకులు మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

READ ALSO : Jalandhara Bandhasana : థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరిచి, జీవక్రియలు వేగవంతం చేసే జలంధర బంధాసనం!

చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు

వేయించిన ఆహారాలు ;

వేయించిన ఆహారాలు, డీప్-ఫ్రైడ్ మాంసాలు , చీజ్ స్టిక్స్ వంటి వాటిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి మరియు రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. కాబట్టి, అటువంటి ఆహారాలను తీసుకోవటాన్ని వీలైనంత వరకు నివారించాలి.

ఫాస్ట్ ఫుడ్ ;

గుండె జబ్బులు, మధుమేహం , ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ప్రధాన ప్రమాద కారకం. తరచుగా ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, పొట్టలో కొవ్వు పెరగడం, ఇన్ఫ్లమేషన్ స్థాయిలు పెరగడం, రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరిగే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Cupping Therapy : నొప్పి, వాపు , కండరాల ఒత్తిడిని తగ్గించటంతోపాటు రక్త ప్రసరణను ప్రోత్సహించే కప్పింగ్ థెరపీ !

ప్రాసెస్ చేసిన మాంసాలు ;

ఆనారోగ్యకరమైన ఆహారం గురించి చెప్పాల్సి వస్తే, సాసేజ్‌లు, బేకన్ మరియు హాట్ డాగ్‌లు వంటి ప్రాసెస్ చేసిన మాంసాల వినియోగాన్ని పరిమితం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్, ప్రత్యేకంగా పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

డెసెర్ట్‌లు ;

కుకీలు, కేకులు, ఐస్ క్రీం మరియు పేస్ట్రీలు వంటి డెజర్ట్‌లలో తరచుగా చెడు కొలెస్ట్రాల్, అనారోగ్య కొవ్వులు, అదనపు చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఆహారాలను నిరంతరం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా బరువు పెరుగేలా చేస్తాయి. షుగర్‌లను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక క్షీణత , కొన్ని క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

READ ALSO : Hair Fall Problem : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? నివారించాలంటే సరైన పోషకాహారం తీసుకోవటమే ఉత్తమ మార్గమా?

ప్రాసెస్ చేసిన మాంసాలు, వేయించిన ఆహారాలు మరియు డెజర్ట్‌లు వంటి అధిక కొలెస్ట్రాల్ ఆహారాలు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువుతోపాటు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాల రకాలు, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి జాగ్రత్త వహించడం చాలా అవసరం.