దగ్గినా.. రొమాన్స్ చేసినా కరోనా సోకుతుందా?

  • Published By: sreehari ,Published On : March 4, 2020 / 11:43 AM IST
దగ్గినా.. రొమాన్స్ చేసినా కరోనా సోకుతుందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఇప్పుడు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇదివరకే 70 దేశాల్లోని వేలాది మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 92,819 కేసులు నమోదు కాగా, 3,164 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు, భారత్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 28కి చేరింది.

జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడికి కరోనా వైరస్ సోకినట్టు పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. దుబాయ్ వెళ్లొచ్చిన హైదరాబాద్ టెకీకి కూడా కరోనా సోకినట్టు తెలంగాణ అధికారులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ఎలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందో తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనా నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంతకీ కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుందో ఈ కింది అంశాలను చదివి తెలుసుకోండి…(వైజాగ్ లో కరోనా : కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు)

కరోనా వైరస్ అంటే ఏంటి? :
కరోనా వైరస్ అనేది ఒక భారీ వైరస్‌ల కుటుంబానికి చెందినది. ఈ వైరస్ బారిన పడితే సాధారణ లక్షణాల మాదిరిగానే జలుబు, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS-Cov) వంటి వ్యాధులకు కారణమవుతాయి. అందులో ఒక వర్గమైన కరోనా వైరస్ (nCov) కొవిడ్-2019.. జంతువుల్లో వ్యాపించే వైరస్ ఇది. గతంలో ఎన్నడూ మనుషుల్లో ఈ వైరస్ వ్యాపించిన దాఖలాలు లేవు. చైనాలోని వుహాన్ సిటీలో డిసెంబర్ 2019న ఈ వైరస్ ఉద్భవించింది.

కరోనా వైరస్.. జంతువుల నుంచి జంతువుల్లోకి.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకినప్పుడు సాధారణ వ్యాధి లక్షణాల్లో శ్వాసక్రియ సమస్యలు, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత మరింతగా పెరిగితే అది న్యూమోనియా, తీవ్ర శ్వాసకోశ సిండ్రోమ్, కిడ్నీ ఫెయ్యిలర్ అవ్వండ.. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.

దగ్గు ద్వారా వ్యాపిస్తుందా? :
ఒకరి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా వారి నోటిలోని చిన్న నీటి బిందువుల ద్వారా వైరస్ మరొకరికి వ్యాపిస్తుంది. ముక్కు లేదా నోటి నుంచి వ్యాపించే వైరస్.. వారు దగ్గినప్పుడు గాల్లోకి చేరుతుంది. అది మరొకరికి సోకే అవకాశం ఉంది. గాల్లో ఎక్కువ సేపు ఉండలేవు.. వెంటనే ఏదైనా వస్తువుల ఉపరితలానికి చేరిపోతాయి. ఆయా వస్తువులను ముట్టుకోవడం లేదా.. వైరస్ సోకిన వ్యక్తి కళ్లు లేదా ముక్కు, నోరును తాకినా కూడా వైరస్ సోకుతుంది. అందుకే బాధితులకు కనీసం 1 మీటర్ (3 అడుగులు) కంటే దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.

గాలి ద్వారా వ్యాపిస్తుందా? :
గాలిద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకుంటే.. కరోనా వైరస్.. ఇతర వైరస్ లతో పోలిస్తే చాలా బరువైనవి.. ఎక్కువ సేపు గాల్లో ఉండలేవు. వెంటనే ఏదైనా వస్తువు ఉపరితలంపైకి చేరిపోతాయి. ఎవరికైనా ఈ వైరస్ సోకితే వారి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. వారు దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించే ఈ వైరస్ దగ్గరలో ఉండే మరో వ్యక్తికి ఈజీగా సోకుతుందని ఎన్నో పరిశోధనలు సూచిస్తున్నాయి.

మలం నుంచి వైరస్ వ్యాపిస్తుందా? :
వైరస్ సోకిన వ్యక్తి మలం నుంచి మరొకరికి ఈ కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ, అది చాలా తక్కువ స్థాయిలో మాత్రమేనని గుర్తించుకోవాలి.

వృద్ధులకు త్వరగా వైరస్ సోకుతుంది :
కరోనా వైరస్.. వృద్ధులకు త్వరగా సోకుతుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా ఒక వయస్పు వారికి మాత్రమే కరోనా సోకుతుందని చెప్పలేని పరిస్థితి. ఇదివరకే ఏదైనా వ్యాధులతో బాధపడుతుండే వృద్ధుల్లో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో పోలిస్తే వీరే అధికంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

మహిళల్లో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ :
కరోనా వైరస్‌ ఎవరికైనా వ్యాపించే అవకాశం ఉంది. అయితే మహిళల్లో కంటే పురుషుల్లో తరచుగా వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చైనా మహిళల్లో 2.8 శాతం మంది మాత్రమే ఈ వైరస్ సోకి మృతిచెందారు. పురుషుల్లో ఎక్కువగా 4.7 శాతం మంది వైరస్ సోకి మృతిచెందారు.

వైరస్ సోకిన వారికి ముద్దుపెడితే సోకుతుందా?
కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ముద్దుపెట్టుకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంది. అయినప్పటికీ కరోనా వైరస్.. లైంగిక చర్య ద్వారా వ్యాపించదని కొంతమంది నిపుణులు న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు.

జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్తే సోకుతుందా?:
వైరస్ ఇన్ఫెక్షన్ అనేది మీరు సోకిన వ్యక్తికి ఎంత దగ్గరగా ఉన్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. వారు తుమ్మినా లేదా దగ్గినప్పుడు నీటి బిందువులు ఎలా వైరల్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ ముఖ్యమే..

పెంపుడు జంతువుల నుంచి ఇన్ఫెక్షన్ సోకుతుందా? :
జంతువులు లేదా పెంపుడు జంతువుల నుంచి వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. పెంపుడు జంతువుల్లో పిల్లులు, కుక్కలకు కూడా ఈ వైరస్ సోకవచ్చు. వాటి నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది.

వైరస్ అరికట్టే చికిత్స ఏదైనా ఉందా? :
వైద్యపరంగా శాస్త్రవేత్తలు సైతం.. కరోనా వైరస్ కు మందు కనిపెట్టే పనిలో పడ్డారు. దీనిపై వారంతా రాత్రింబవళ్లు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వైరస్ ను నిరోధించే ఏ వ్యాక్సీన్ లేదా డ్రగ్స్ కనిపెట్టలేదు. Remdesivir అనే యాంటీ వైరల్ డ్రగ్ కూడా పనిచేయదు. ఈ మందు ప్రత్యేకించి ఎబోలా కోసం తయారు చేశారు. అయినప్పటికీ కరోనా సోకినవారిలో వాషింగ్టన్ స్టేట్‌లో కొందరికి, చైనాలో కొందరి పేషెంట్లకు ఈ మందును ఇచ్చి చూశారు. పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి.

వైరస్ నెగటీవ్ వస్తే.. ఆపాయం లేనట్టేనా? :
ఒక సింగిల్ నెగటీవ్ టెస్టుతో.. మీకు ఇన్ఫెక్షన్ లేదని గట్టిగా చెప్పలేం. వైరస్ అనుమానిత వ్యక్తుల్లో తరచూ టెస్టింగ్స్ చేస్తుండాలి.. అప్పుడు కచ్చితమైన నిర్ణయానికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వైరస్ సోకిందా లేదా అనేది అప్పుడే నిర్ధారించుకోవాలి.

వైరస్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి :
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కరోనా వైరస్ నివారణ కోసం ప్రామాణిక సిఫార్సులు తప్పనిసరిగా ఉండాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మడం లేదా దగ్గినప్పుడు, మాంసం వండడం, గుడ్లు ఉడికించినప్పుడు ముక్కు, నోటిని మాస్క్ లతో కవర్ చేసుకోవాలి. తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు దగ్గర ఉండకుండా జాగ్రత్తుల తీసుకోవాల్సిన అవసరం ఉంది.