Health Tips : ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !

సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

Health Tips : ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !

home remedies

Health Tips : ఉబ్బరం, త్రేనుపులు, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలో చాలా మందిలో దీర్ఘకాలికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి తీవ్రంగా మారాతాయి. పొత్తికడుపు నొప్పి, ప్రేగులలో సమస్యలు, బరువు తగ్గడం వంటి ఇతర ఇబ్బందికరమైన లక్షణాలతో బాధపడాల్సి వస్తుంది. ఈ సాధారణ జీర్ణ సమస్యలైతే వీటిని సహజసిద్ధమైన ఇంటి నివారణ చిట్కాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఈ జీర్ణపరమైన అసౌకర్యాలను తగ్గించడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

పుదీనా టీ : పిప్పరమింట్ టీలో మెంథాల్ ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగు యొక్క కండరాలను సడలింపునివ్వటంలో సహాయపడుతుంది. ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడానికి, త్రేనుపులు తగ్గడానికి భోజనం తర్వాత ఒక కప్పు పిప్పరమెంటు టీని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అల్లం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థను శాంతపరచడంలో సహాయపడుతుంది. అల్లం టీని తీసుకోవటంతోపాటు, ఉప్పుతో కలిపి ఎండబెట్టిన అల్లం ముక్కలను నమిలి తినవచ్చు. పొట్ట ఉబ్బరం తగ్గించడానికి భోజనం చేసే సమయంలో అల్లం చిన్నముక్కను కలిపి ఒక ముద్దలో తీసుకోండి.

READ ALSO : Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

సోంపు గింజలు: సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపు గింజలను నమలటం మంచిది. ఈ విత్తనాలను వేడి నీటిలో నానబెట్టి సోపు టీని తయారు చేసుకుని తీసుకోవచ్చు.

యాక్టివేటెడ్ చార్‌కోల్: బొగ్గు, కొబ్బ‌రికాయ టెంక‌, వెదురు త‌దిత‌రాల‌తో తయారైన బొగ్గుపొడిని యాక్టివేటెడ్ చార్‌కోల్ గా పిలుస్తారు. దీనిని జీర్ణవ్యవస్థలోని అదనపు గ్యాస్‌లను గ్రహించటంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం మార్కట్ లో ఇది సప్లిమెంట్ రూపంలో, పొడి రూపంలో అందుబాటులో ఉంది, అయితే దీనిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకుని వాడటం మంచిది.

READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !

ప్రోబయోటిక్స్: ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా.. ఇవి పేగులలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి. పెరుగు వంటి ఆహారాలు తీసుకోవడం, ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం తగ్గుతుంది.

ఆహారాన్ని నమిలి తినటం: ఆహారాన్ని హడాహుడిగా తినటం ఏమాత్రం మంచిది కాదు. త్వరగా తినడం వల్ల ఆహారంతోపాటు గాలిని మింగేస్తాం. దీని వల్ల పొట్ట ఉబ్బరం, అధిక త్రేనుపులు వస్తాయి. ఈ సమస్యను తగ్గించడానికి ఆహారాన్ని నిదానంగా నమిలి తినటం మంచిది.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

నిమ్మ నీరు: నిమ్మరసం జీర్ణ రసాలను ఉత్తేజపరిచేందుకు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం పిండుకుని, ఉదయాన్నే తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

గ్యాస్ కు కారణమయ్యే ఆహారాలను నివారించటం : బీన్స్, క్యాబేజీ, ఉల్లిపాయలు, కార్బోనేటేడ్ పానీయాలు వంటివి కొంతమంది వ్యక్తులలో అధిక గ్యాస్ , ఉబ్బరానికి దారితీస్తాయి. వీటిని తీసుకోకపోవటమే మంచిది.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

నీరు బాగా సేవించటం : రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల మలబద్ధకం నివారించవచ్చు. నీరు సరిగా తాగకుండే కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. సరైన జీర్ణక్రియకు నీరు బాగా తాగటం మంచిది.

వ్యాయామం: నడక వంటి తేలికపాటి శారీరక శ్రమల వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగా ఉంటుంది. గ్యాస్‌ వంటివి ఉండవు, కడుపు ఉబ్బరం తగ్గించడంలో వాకింగ్ సహాయపడుతుంది.