బ్లూ లైట్‌తో భద్రం.. రాత్రి మొబైల్ వాడేవారిలోనే ఒత్తిడి ఎక్కువ : సైంటిస్టుల హెచ్చరిక

  • Published By: srihari ,Published On : June 2, 2020 / 02:21 PM IST
బ్లూ లైట్‌తో భద్రం.. రాత్రి మొబైల్ వాడేవారిలోనే ఒత్తిడి ఎక్కువ : సైంటిస్టుల హెచ్చరిక

కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది తమ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. పగలు.. రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్ బ్లూ లైట్ స్ర్కీన్ చూస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం… ఉదయం లేటుగా లేవడం.. వెంటనే మళ్లీ చేతులోకి ఫోన్ అందుకోవడం.. లైఫ్ లో ఇదొక అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా, ఆన్ లైన్లో ఫేవరెట్ మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నారు. రీసెర్చర్ల అధ్యయనం ప్రకారం.. రాత్రి సమయాల్లోనే లాక్ డౌన్ సమయంలో చాలామంది ఎక్కువగా ఫోన్ స్ర్కీన్ చూస్తున్నారని గుర్తించారు. కొత్త రీసెర్చర్ ప్రకారం.. సాధ్యమైనంతవరకు రాత్రి ఫోన్ పక్కన పెట్టడమే ఎంతో ఉత్తమం. లేదంటే మీలో నిద్ర చక్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

తద్వారా నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలకు స్వాగతం పలికనట్టే అంటున్నారు. రాత్రిళ్లు బ్లూ ఫోన్ లైట్ స్ర్కీన్ చూడటం వల్ల మీ కళ్లు దెబ్బతినడంతో పాటు అనారోగ్యాలకు ప్రధాన కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. చురుకుతనం ఉండదు. ఉత్సాహం కోల్పోతారు. సరైన నిద్రలేక తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రత్యేకించి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని Nature Neuroscienceలో రీసెర్చర్లు పబ్లీష్ చేశారు. తమ ప్రయోగాల ఆధారంగా పరిశోధకులు ఫోన్ స్ర్కీన్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ తరంగాలు హనికరమైనవిగా వెల్లడించారు. బ్లూ లైట్ అనేది ఒక స్పెక్ట్రమ్ లైట్ తరచుగా LED, స్ర్కీన్లు, ఫ్లోరోసెంట్ బల్బ్ నుంచి రిలీజ్ అవుతుంది.

Staring At Your Phone At Night Could Make You Feel Depressed, Claim Researchers

బ్లూ లైట్ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు చైనాలోని Hefei University రీసెర్చర్లు రాత్రి సమయంలో ఎలుకలకు రెండు గంటల డోస్‌‌తో బ్లూ లైట్‌లో ఉంచారు. ఇలా మూడు వారాల పాటు ల్యాబ్‌లో ఉంచి పరీక్షించారు. ఈ మూడు వారాల్లో జంతువుల్లో మానసిక ఒత్తిడితో కూడిన ప్రవర్తనను గమనించారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు దాని ప్రభావం ఎలుకల్లో అలానే ఉందని గుర్తించినట్టు తెలిపారు. మెదడులోని రెండు ప్రత్యేకమైన ప్రాంతంతో కంటి నుంచి రెటీనా ద్వారా బ్లూ లైట్ రిసెప్టెర్ ప్రవేశించినట్టు గుర్తించారు. అక్కడ కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాంతమంతా బ్లాక్ అయినట్టుగా రీసెర్చర్లు గమనించారు.

లైట్ కారణంగా వాటి ప్రవర్తనలోనూ చాలా మార్పులను గుర్తించినట్టు రీసెర్చర్లు వెల్లడించారు. పగలు కంటే రాత్రిలోనే ఫోన్ లైట్ ప్రభావం అధికంగా ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు. పగటి సమయంలో ఎలాంటి మార్పులు కనిపించలేదని అన్నారు. బ్లూ లైట్ కారణంగా మానసికంగా ఒత్తిడి పెరిగి మూడ్ మారిపోవడం గమనించినట్టు తెలిపారు. ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ఇలాంటి సమస్య ఉంటుందని తెలిపారు. నైట్ టైమ్ వెలుగు ప్రభావంతో మానసిక ఒత్తిడికి సంబంధించిన లక్షణాలను అర్థం చేసుకోవడం సాధ్యపడిందని రీసెర్చర్లు స్పష్టం చేశారు.