Tulsi Seeds : శరీరంలో అధిక వేడి ఉష్ణోగ్రతను తగ్గించటంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే తులసి గింజలు !

తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.

Tulsi Seeds : శరీరంలో అధిక వేడి ఉష్ణోగ్రతను తగ్గించటంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే తులసి గింజలు !

tulsi seeds

Tulsi Seeds : తులసి గింజలను సబ్జా విత్తనాలు, తుక్మారియా విత్తనాలు అని కూడా పిలుస్తారు. వీటిని తులసి మొక్క నుండి సేకరిస్తారు. చిన్న నల్లటి వర్ణం కలిగిన గింజలు. తులసి ఆకులను సాధారణంగా ఔషదగుణాలు కలిగిన మూలికగా అందరూ ఉపయోగిస్తారు. అయితే విత్తనాలను పెద్దగా ఉపయోగించరు. వేసవి కాలంలో ఎక్కువగా ఈ విత్తనాలను నీటిలో వేసి నానబెట్టుకుని బెల్లం , పంచదార కలుపుకుని సేవిస్తుంటారు. ఇలా సేవించటం వల్ల శరీరంలోని వేడి తొలగిపోయి చల్లబడుతుందని నమ్ముతారు. అయితే ఈ సబ్జా గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Health Tips : ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !

తులసి గింజలతో ప్రయోజనాలు ;

జీర్ణశక్తికి : తులసి గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది నానబెట్టిన తర్వాత జెల్ లాంటి పదార్థంగా మారుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. బరువు తగ్గాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి బాగా ఉపకరిస్తాయి.

బ్లడ్ షుగర్ కోసం : దీనిలో ఉండే ఫైబర్ తో జీర్ణవ్యవస్థలో చక్కెరల శోషణను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో తులసి గింజలు సహాయపడతాయి.

READ ALSO : Gastric Problem : తరచుగా గ్యాస్ సమస్య బాధిస్తుందా ?… ఈ పరీక్షలు చేయించుకోండి

శరీరాన్ని చల్లబరిచే గుణం : తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.

పోషకాల మూలం: తులసి గింజలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. ఈ మూలకాలు ఆరోగ్యానికి , రోగనిరోధక శక్తిని పెంచటానికి తోడ్పడతాయి.

READ ALSO : Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

హైడ్రేషన్ కలిగి ఉండేందుకు: తులసి గింజల నీటిని సేవించటం ద్వారా హైడ్రేషన్ స్ధాయిలను పెంచుకోవచ్చు. తులసి గింజలు తేమను నిలిపి ఉంచటంలో సహాయపడే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. హైడ్రేషన్ స్థాయిలను కలిగి ఉండటానికి సహాయపడే సహజమైన  గింజలుగా ఉపయోగపడతాయి.

చర్మ ఆరోగ్యం: తులసి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు కలిగిస్తాయి. వీటి వినియోగం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, యవ్వనంగా కనిపించేలా, ఆగ్యకరమైన ఛాయకు దోహదం చేస్తాయి.

READ ALSO : Cardamom : అజీర్ణం, గ్యాస్ సమస్యలకు యాలకులతో చెక్

పేగు ఆరోగ్యానికి : తులసి గింజలలోని కరిగే ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య గట్ మైక్రోబయోమ్‌కు సహాయపడుతాయి. ఆహారపదార్ధాల తయారీలో తులసి గింజలను చేర్చడం వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.