పివి సింధుకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 03:17 PM IST
పివి సింధుకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బుధవారం(ఆగస్టు 28,2019) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసింది సింధు. తన విజయానికి సంబంధించిన ఆనందాన్ని పంచుకుంది. బ్యాడ్మింటన్ టోర్నీలో గెలిచిన గోల్డ్‌ మెడల్‌ను సీఎం కేసీఆర్‌కు చూపించింది. అంతేకాదు కేసీఆర్ కు రెండు బ్యాడ్మింటన్ రాకెట్లను బహుమానంగా ఇచ్చింది. సీఎం కేసీఆర్ కూడా సింధుకి గిఫ్ట్ ప్రకటించారు. భవిష్యత్తులో సింధు పాల్గొనే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తామని, అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సింధు ఎంతో కఠోర సాధన చేస్తే కానీ ఈ స్థాయికి రాలేదన్న సీఎం కేసీఆర్‌.. ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. సింధు భవిష్యత్తులో అనేక టోర్నమెంట్లు ఆడాలని.. ఒలంపిక్స్‌కు వెళ్లాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరీ నాథ్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని కేసీఆర్ అన్నారు. గతంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించి సత్కరించిన విషయం తెలిసిందే.