India’s Active caseload: దేశంలో 1,35,364కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు

దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 21,595 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది.

India’s Active caseload: దేశంలో 1,35,364కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు

India's Active caseload

India’s Active caseload: దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 21,595 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది. వారాంత‌పు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది.

క‌రోనా రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 98.50 శాతంగా ఉందని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,45,624గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 87.71 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 4,00,110 క‌రోనా ప‌రీక్ష‌లు చేశార‌ని వివ‌రించింది.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 205.59 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశామ‌ని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.46 కోట్లు, బూస్ట‌ర్ డోసులు 10.09 కోట్లు ఉన్నాయ‌ని పేర్కొంది. నిన్న దేశంలో 36,95,835 డోసుల వ్యాక్సిన్లు వేశార‌ని వివ‌రించింది.

Flipkart-Amazon Independence Sale 2022: రేప‌టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్లు.. వీటిపై త‌గ్గింపు ధ‌ర‌లు