Gujarat Assembly election-2022: గుజరాత్ ప్రజల మద్దతు సంపాదించాలంటే కాంగ్రెస్ ఈ పని చేయాలి: మోదీ

గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందాలంటే కాంగ్రెస్ పార్టీ ‘విభజించు-పాలించు’ వ్యూహానికి దూరంగా ఉండాలని చెప్పారు.

Gujarat Assembly election-2022: గుజరాత్ ప్రజల మద్దతు సంపాదించాలంటే కాంగ్రెస్ ఈ పని చేయాలి: మోదీ

will win every booth in gujarat says pm modi

Gujarat Assembly election-2022: గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందాలంటే కాంగ్రెస్ పార్టీ ‘విభజించు-పాలించు’ వ్యూహానికి దూరంగా ఉండాలని చెప్పారు.

ఒక మత, వర్గానికి చెందిన ప్రజలను మరో మత, వర్గాలకు చెందిన ప్రజలకు మధ్య చిచ్చుపెట్టే పాలసీని పాటించిన కాంగ్రెస్ విధానాల వల్ల గుజరాత్ ఎన్నో ఇబ్బందులు పడిందని అన్నారు. అందుకే ఆ పార్టీని గుజరాత్ తిరస్కరించిందని చెప్పారు. దేశాన్ని విభజించాలనుకుంటున్న వారికి మద్దతు తెలుపుతున్న వారి పట్ల గుజరాత్ ప్రజలు విముఖత చూపుతారని అన్నారు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

‘‘గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీ గుజరాతీ, మరాఠీలకు మధ్య ఘర్షణలు సృష్టించింది. అనంతరం కులాలు, మతాలకు మధ్య విభేదాలు సృష్టించింది. ఇటువంటి చర్యలతో గుజరాత్ ఇబ్బందులు పడింది’’ అని మోదీ అన్నారు. నర్మదా బచావ్ ఆందోళన నాయకురాలు మేధా పాట్కర్ ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై మోదీ మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాగా, 182 మంది సభ్యులు ఉండే గుజరాత్ అసెంబ్లీకి డిసెంబరు 1, 5న ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు డిసెంబరు 8న వెలువడుతాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..