3-Year-Old Shoots Toddler: 15 నెలల చిన్నారిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల బాలుడు 

మూడేళ్ల బాలుడు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ 15 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూసేలోపు గాయాలతో పసివాడు కనపడ్డాడు. అతడిని రక్షించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి.

3-Year-Old Shoots Toddler: 15 నెలల చిన్నారిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల బాలుడు 

3-Year-Old Shoots Toddler: మూడేళ్ల బాలుడు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ 15 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూసేలోపు గాయాలతో పసివాడు కనపడ్డాడు.

అతడిని రక్షించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. కాల్పులు జరిగిన వెంటనే ఆ పసివాడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ కాల్పుల ఘటనపై ఆ ఇంట్లోని పెద్దవారిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

పసివాడు ప్రాణాలు కోల్పోవడంపై అతడి తాత మీడియాతో మాట్లాడారు. కాల్పులు జరిపిన మూడేళ్ల బాలుడు కూడా తమ బంధువుల పిల్లాడేనని చెప్పారు. అమెరికాలో ఆత్మరక్షణ కోసం చాలా మంది తుపాకులు తీసుకుంటారు. అయితే, పెద్దలకు తెలిసో తెలియకో అవి చిన్నారుల చేతుల్లోకి వెళ్లి పదే పదే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..