Viral Video: అయ్యయ్యో దొంగ.. భలే దొరికిపోయాడే..! డోర్ లేదనుకొని బ్యాగ్‌తో పరుగెత్తాడు.. సెక్యూరిటీ వచ్చి లేపితేకానీ తెలియలేదు..

వాషింగ్టన్‌లోని లూయిస్ విట్టర్ స్టోర్‌లోకి ప్రవేశించిన 17ఏళ్ల వయస్సు కలిగిన దొంగ రూ.18వేల డాలర్ల విలువైన బ్యాగులను దొంగిలించాడు. గ్లాస్ డోర్ తీసి ఉందనుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. డోర్‌ను ఢీకొని కిండపడిపోయాడు. సెక్యూరిటీ వచ్చి లేపితేకానీ తెలియలేదు. అది గ్లాస్ డోర్.. మూసి ఉందని.

Viral Video: అయ్యయ్యో దొంగ.. భలే దొరికిపోయాడే..! డోర్ లేదనుకొని బ్యాగ్‌తో పరుగెత్తాడు.. సెక్యూరిటీ వచ్చి లేపితేకానీ తెలియలేదు..

Viral Video

Viral Video: వాషింగ్టన్‌లోని లూయిస్ విట్టర్ స్టోర్‌లోకి ఓ దొంగ ప్రవేశించాడు.. కొద్దిసేపు అటూఇటూ తిరిగి కొన్ని బ్యాగులను ఎత్తుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని తప్పుడు పనిని దేవుడు గమనించాడేమోకాబోలు.. డోర్‌ను ఢీకొని కిందపడిపోయాడు.. సెక్యూరిటీ వచ్చి లేపితేకానీ తెలియలేదు.. అది గ్లాస్ డోర్ అని. ఆ డోర్ తీసిఉంది అనుకొని దొంగ పరుగెత్తాడు. కానీ ఆ గ్లాస్ డోర్ మూసి ఉంది.

Old Lady Dance viral video : ఈ బామ్మగారి స్టెప్పులు చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా వావ్ అనాల్సిందే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగ వయస్సు 17ఏళ్లు. 18వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగులను దొంగతనం చేశాడు. న్యాయవాదులు దొంగకు 17ఏళ్లు మాత్రమే ఉండటంతో అతని పేరును బయటపెట్టలేదు. అయితే ఆ దొంగకు నేరచరిత్ర ఉందని, గతంలోకూడా పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సదరు దొంగ బ్యాగులతో పారిపోతూ గ్లాస్ డోర్ ను ఢీకొని కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెల్లేవ్ పోలీస్ కెప్టెన్ రాబ్ స్పింగ్లర్ మాట్లాడుతూ.. ఇటీవలకాలంలో రిటైర్ దుకాణాల్లో, షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్న 50 మందికి అరెస్టు చేశామని తెలిపారు. బెల్లేవ్ నగరానికి వచ్చి నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు.