Space Radio Waves : అంతరిక్షంలో వింత.. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్.. ఏలియన్స్ పనేనా?

అంతరిక్షంలో ఓ వింత.. అదేంటో సైంటిస్టులకే అంతుపట్టడం లేదట.. ఏదో తెలియని వింతైన వస్తువు శక్తివంతమైన సంకేతాలను విడుదల చేస్తోంది.

Space Radio Waves : అంతరిక్షంలో వింత.. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్.. ఏలియన్స్ పనేనా?

A Strange Object In Space I

Space Radio Waves: అంతరిక్షంలో ఓ వింత.. అదేంటో సైంటిస్టులకే అంతుపట్టడం లేదట.. ఏదో తెలియని వింతైన వస్తువు శక్తివంతమైన సంకేతాలను విడుదల చేస్తోంది. అది ఏమై ఉంటుందని పరిశోధకులు నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నడూలేని వింతైన ఈ అంతరిక్ష వస్తువు గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదో కొత్త నూట్రాన్ స్టార్ కావొచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. లేదంటే.. ఏలియన్లే ఇదంతా చేస్తున్నారా? మానవాళితో కనెక్టింగ్ కోసం ఏలియన్స్ ఈ తరహా రేడియో సిగ్నల్స్ పంపుతున్నారా? అదేంటో తేల్చేపనిలో పడ్డారు సైంటిస్టులు..

సాధారణంగా మ‌న గెలాక్సీలో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో ఓ రహాస్యం ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌ను వెంటాడుతోంది. అంత‌రిక్షంలోని మిల్క్ వేవ్ (పాల‌పుంత) నుంచి రేడియో సంకేతాలు (Radio Signals) సైంటిస్టులను విస్మయానికి గురిచేస్తోంది. సుమారు 4 వేల కాంతి సంవ‌త్స‌రాల దూరంలో పాలపుంత నుంచి ప్ర‌తి 18 నిమిషాల‌కు ఒక‌సారి రేడియో తరంగాలను విడుదల చేస్తున్నట్టు ఖగోళ సైంటిస్టులు గుర్తించారు. అయితే ఆ గెలాక్సీలో ఉన్న గుర్తు తెలియని న‌క్ష‌త్రం నుంచి ఆ త‌రంగాలు (సిగ్నల్స్) వస్తున్నాయని గుర్తించారు. ఇంతకీ ఆ వింతైన వస్తువు ఏంటి అనేది మిస్టరీగానే ఉంది.

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్శిటీలోని నటాషా హర్లీ-వాకర్, తన తోటి సైంటిస్టులతో కలిసి రేడియో టెలిస్కోప్ ముర్చిసన్ వైడ్‌ఫీల్డ్ అర్రే (MWA)ని ఉపయోగించి ఈ వస్తువును కనుగొన్నారు. రేడియో తరంగాల బ్యారేజీని గుర్తించారు. అయితే అది కనిపించి వెంటనే అదృశ్యమైనట్లు గుర్తించారు. 2018 ప్రారంభంలో MWA తీసుకున్న ఆర్కైవల్ డేటాను పరిశీలించగా.. మరో 71 వరకు కనుగొన్నారు.

ప్రతి పల్స్‌తో వస్తువు GLEAM-X J162759.5-523504.3 అని పేరు పెట్టారు. దాదాపు 4వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గ్రహించారు. ఈ వస్తువు నుంచి భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుందని గుర్తించారు. అందులో నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి చాలా తీవ్రమైనదిగా ఖగోళ సైంటిస్టులు హర్లీ-వాకర్ చెప్పారు. అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువును ఏదైనా కనుగొంటామని ఊహించలేదన్నారు.

ముర్చిస‌న్ వైడ్‌ఫీల్డ్ ఆరే టెలిస్కోప్ ద్వారా ఆ న‌క్ష‌త్ర స‌మూహాన్ని గుర్తించారు. న‌క్ష‌త్రం ఆకారంలో తిరుగుతున్న అంత‌రిక్ష వ‌స్తువును మార్చి 2018లో మొదటిసారిగా గుర్తించారు. న‌క్ష‌త్రం రిలీజ్ చేసే రేడియో సిగ్నల్స్ భూమి నుంచి కూడా చూడ‌వ‌చ్చునని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అదో రోద‌సీ లైట్‌హౌజ్ గా చెబుతున్నారు.

Read Also : 11:11 Telugu Movie : రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్.. వీడియో వైరల్..