Afghanistan crisis: కాబూల్‌లో తాలిబన్ల జెండా.. రాజధానిలో ప్రవేశించిన తీవ్రవాదులు

అఫ్ఘనిస్తాన్‌‌లో తాలిబాన్ తీవ్రవాదులు తీవ్రవాదులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడం ప్రారంభించారు

Afghanistan crisis: కాబూల్‌లో తాలిబన్ల జెండా.. రాజధానిలో ప్రవేశించిన తీవ్రవాదులు

Kabul (1)

Afghanistan crisis: తాలిబాన్ తీవ్రవాదులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడం ప్రారంభించారు, అఫ్ఘన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలపిన వివరాల ప్రకారం.. వేగంగా తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశిస్తున్నారు. అప్ఘాన్‌పై పూర్తిగా పట్టు బిగించిన తాలిబన్లు.. నగర శివార్లలోకి ప్రవేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. అఫ్ఘాన్, తాలిబన్ల మధ్య భీకర వార్‌ జరుగుతుండగా.. మరోవైపు కాబూల్‌ భద్రంగా ఉందని అధ్యక్షుడి తరపున ప్రకటన విడుదలైంది. అయితే, నగర శివారుల్లో తాలిబన్ జెండాలు ఎగురుతున్నట్లు మీడియా ప్రకటించింది. ఇప్పటికే కాబూల్‌కు అన్ని ప్రాంతాలతో సంబంధాలు కట్ అయ్యాయి.

నగరానికి వచ్చే అన్ని మార్గాలను తాలిబన్లు ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు నగరంలోంచి బయటకు, లోపలకు రాకపోకలు లేవు. ప్రస్తుతం నగర శివారులో సైన్యానికి, తాలిబన్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. కాబూల్‌ చేరడానికి తాలిబన్లకు మూడు నెలలు పడుతుందని అమెరికా సైన్యం అంచనా వేసిన పదిరోజుల్లోనే తాలిబన్లు కాబూల్‌ రాజధానిని చేరారు. వారి దూకుడు ముందు సైన్యం ఏం చేయలేకపోతోంది.

మరోవైపు ఘనీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తాలిబన్లతో పోరాడటం లేకపోతే లొంగిపోవడం మినహా మరో మార్గాలు లేవు. అయితే సైన్యం ఇప్పటికే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. ఘనీ రాజీనామా చేసి కుటుంబంతో సహా మరో దేశానికి పారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు స్థానిక నేతలు ఇతర దేశాలకు పారిపోయారు.

కఠినమైన తాలిబాన్ దాడి మధ్య, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న భూభాగం మరింత కుంచించుకుపోయింది, కాబూల్‌కు పశ్చిమాన తాలిబాన్లు ప్రాదేశిక రాజధాని మైదాన్ వార్దక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు . ఎనిమిది వారాల లోపు, మజార్-ఇ-షరీఫ్, లోగర్ ప్రావిన్స్, కాందహార్, హెరాత్‌తో సహా అన్ని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకున్నారు. గత 24 గంటల్లో నగరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.