Crazy Job Offer: నెలకు రూ.6లక్షల ఉద్యోగం కావాలా..? ఓన్లీ చాక్లెట్లు రుచిచూడటమే.. ఆగస్టు వరకే అవకాశం..!!
మీకు నెలకు వేలల్లో వేతనాలు వచ్చే ఉధ్యోగాలు చేసి విసుగొచ్చిందా..? నెలకు ఐదు లక్షలకు పైగా వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. అమెరికన్ క్యాండీ రిటైలర్ ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్(సీసీఓ) ఉద్యోగానికి విద్యా అర్హత అంటూ ఏమీ లేదు.

Candy
Crazy Job Offer: మీకు నెలకు వేలల్లో వేతనాలు వచ్చే ఉధ్యోగాలు చేసి విసుగొచ్చిందా..? నెలకు ఐదు లక్షలకు పైగా వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. అమెరికన్ క్యాండీ రిటైలర్ ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్(సీసీఓ) ఉద్యోగానికి విద్యా అర్హత అంటూ ఏమీ లేదు. ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఎవరైనా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంకోసం దరఖాస్తు చేసుకొనే చివరి తేదీని ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.
నెలకు సుమారు 6లక్షలు ఇస్తున్నారంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. అలాంటి భయాలేమీ మీరు పెట్టుకోకండి.. ఎందుకంటే ఇక్కడ మీరు చేయాల్సిన పని పెద్దగా ఉండదు. కేవలం ఆ కంపెనీ తయారు చేసే చాక్లెట్లు, ఇతర రుచికరమైన పదార్థాలను రుచిచూసి అవి ఎలా ఉన్నాయో రేటింగ్ ఇవ్వడమే. ఈ కంపెనీ హెడ్ టేస్ట్ టెస్టర్ గా ఎంపికైన వ్యక్తి.. కాండియాలజిస్టుల బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఉద్యోగ నియామకం ప్రకారం.. నియమితులైన వ్యక్తి కంపెనీ బోర్డు సమావేశాలు నిర్వహించాలి. అంతకంటే ముఖ్యంగా స్వీట్ల పట్ల అభిరుచి కలిగి ఉండాలి. ఆ కంపెనీ నుంచి వచ్చే చాక్లెట్ల టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పగలగాలి. అందుకు మేము వయస్సును అసలు పరిగణలోకి తీసుకోలేదని కంపెనీ సీఈవో జమాల్ హెజాజీ తమ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు.
Divi Vadthya : చిరు నవ్వుతో నాభి అందాలు చూపిస్తున్న దివి
ఈ ఉద్యోగానికి ఆసక్తి ఉన్న వారు ఎవరైన ఆగస్టు 31లోపు కంపెనీ వెబ్ సైట్ లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని, పిల్లల తరుపున వారి తల్లిదండ్రులు కూడా దరఖాస్తు చేయవచ్చునని కంపెనీ తెలిపింది. ఇందుకోసంhttps://candyfunhouse.ca/pages/careers కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Candy Officer