Indian-Origin Teen: ఆస్ట్రేలియాపై న్యాయపోరాటానికి దిగిన భారత సంతతి టీనేజర్

ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టు ల్యాండ్‌మార్క్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సోమవారం న్యాయపోరాటానికి దిగారు భారత సంతతి యువత.

Indian-Origin Teen: ఆస్ట్రేలియాపై న్యాయపోరాటానికి దిగిన భారత సంతతి టీనేజర్

Australia Legal Fight

Indian-Origin Teen: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టు ల్యాండ్‌మార్క్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సోమవారం న్యాయపోరాటానికి దిగారు భారత సంతతి యువత. భవిష్యత్ లోనూ వాతావరణ మార్పులు, వ్యక్తిగత గాయాల నుంచి రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనంటూ అందులో పేర్కొన్నారు. ఈ లీగల్ బ్యాటిల్ లో మెల్‌బోర్న్‌కు చెందిన భారత సంతతి 17 ఏళ్ల విద్యార్థి అంజలి శర్మ మరో ఏడుగురు టీనేజ్ పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.

శర్మతో పాటు ఆమె టీం వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ యొక్క నిరంతర ఉద్గారాలు తీవ్రమైన బుష్‌ఫైర్‌లు, వరదలు, తుఫానులు వల్ల గాయాలు కావడం, తీవ్రమైన జబ్బులు రావడం, ఆర్థిక నష్టం, కొన్నిసార్లు మరణం వంటివి జరుగుతున్నాయని వెల్లడించారు. దీనికి సంబంధించి నార్తరన్ సౌత్ వేల్స్ లో ఉన్న కోల్ మైన్ ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ మంత్రి సుస్సాన్ లీ అప్రూవల్ ను అడ్డుకోవాలని కోర్టును కోరారు.

వారికి అనుకూలంగా జస్టిస్ మొర్దెకాయ్ బ్రోమ్‌బర్గ్ ప్రాజెక్ట్ పొడిగింపును ఆమోదించారు. ఏదేమైనా, పర్యావరణ రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ (EPBC చట్టం) కింద ప్రాజెక్ట్ పొడిగింపుతో పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సహేతుకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత’ మంత్రికి ఉందని స్పష్టమైంది.

…………………………………….: ప్రభాస్ ‘సలార్’ సినిమా లీకులు.. షాక్ అయిన నిర్మాతలు

ఆస్ట్రేలియాలో పెరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ నా చదువు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. అని చెప్పింది అంజలి శర్మ. ఆమెకు 10నెలల వయస్సున్నప్పుడే కుటుంబం లక్నో నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఆమె బంధువులు కూడా రైతులే.