China Billionaires : చైనాకు సంపన్నుల బిగ్ షాక్.. సంపద కాపాడుకునేందుకు సింగపూర్‌కు పయనం

చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నులకు స్వర్గధామంగా ఉన్న సింగపూర్ కు పయనం అవుతున్నట్లు తెలుస్తోంది.

China Billionaires : చైనాకు సంపన్నుల బిగ్ షాక్.. సంపద కాపాడుకునేందుకు సింగపూర్‌కు పయనం

China Billionaires : చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నులకు స్వర్గధామంగా ఉన్న సింగపూర్ కు పయనం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు సింగపూర్ కు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ లో గత 6 దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కార్మిక సమ్మెలు, విధుల్లో ఆందోళనలపై నిషేధం ఉంది. పన్నుల శాతం కూడా చాలా తక్కువ. దీనికి తోడు చైనా వాసులు ఎక్కువగా సింగపూర్ లో నివసిస్తుండటం కలిసొచ్చే అంశం. దీంతో ఎక్కువమంది సంపన్నులు సింగపూర్ ను గమ్యస్థానంగా మార్చుకుంటున్నారు.

Also Read..Chinese spy balloon: ముప్పు ఉండదని చెప్పినా కూల్చేస్తారా..? అమెరికాలో స్పై బెలూన్ కూల్చివేతపై ఘాటుగా స్పందించిన చైనా ..

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై అక్కడి బిలియనీర్లకు నమ్మకం లేకపోవడమే సింగపూర్ తరలిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. జాక్ మా పరిస్థితే తమకూ రావొచ్చని ఆందోళన చెందుతున్నారు. అదే సింగపూర్ కు వెళితే ఇన్నాళ్లు సంపాదించుకున్న తమ సొమ్ముకు డోకా ఉండదని, రాబోయే తరాల వారికి సంపదను అందించిన వారమవుతామని చైనా సంపన్నులు భావిస్తున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా బిలినీయర్లు కలిగిన దేశాల్లో ఒకటి చైనా. అక్కడ సంపన్నులకు కొదవ లేదు. పెద్ద సంఖ్యలో కుబేరులు ఉన్నారు. అయితే, ఇప్పుడు వారంతా అభద్రతా భావంతో ఉన్నారు. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో పారిశ్రామికవేత్తలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చైనా ప్రభుత్వ తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎక్కడ తమ ఆస్తులు, సంపదలు కరిగిపోతాయోనని, తాము బికారులం అవుతామోనని, రోడ్డున పడతామోనని టెన్షన్ పడుతున్నారు.

Also Read..India Blocks China Apps : చైనాకు భారత్ బిగ్ షాక్.. మరోసారి భారీ స్థాయిలో డిజిటల్ స్ట్రైక్, 232 యాప్స్‌పై నిషేధం

దీంతో బిలియనీర్ల వలసబాట పట్టారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటున్న చర్యలకు భయపడి, సురక్షితంగా ఉంటుందని సింగ్‌పూర్‌కు పారిపోతున్నారు. నిర్బంధ వాణిజ్య విధానాలు, ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే వేధింపులకు గురిచేయడం, వ్యాపారాలను దెబ్బతీయడం, అక్రమ కేసులు పెట్టడంతో చైనాలో బిలియనీర్లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. జిన్‌పింగ్ ప్రభుత్వ నియంత పోకడలకు విసిగిపోయి దేశం వదిలిపెడుతున్నారు.

ఇలా వలస పోయే వారికి సింగపూర్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. వ్యాపారులు, పారిశ్రామిక దిగ్గజాలపై కఠిన ఆంక్షలు విధించడం, మూడేళ్ల పాటు జీరో కోవిడ్ విధానం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్న కోటీశ్వరులు సింగపూర్‌ సురక్షితంగా భావిస్తున్నారు. చాలామంది ఆ దేశంలోనే శాశ్వతంగా ఉండిపోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఆరు దశాబ్దాల నుంచి ఒకే పార్టీ అధికారంలో కొనసాగడం, తక్కువ పన్నులు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులతో ప్రపంచంలోనే సింగ్‌పూర్ అగ్రభాగాన ఉంది. విదేశీ పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారింది. పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనూ ముందుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక సింగపూర్ జనాభాలో రెండింట మూడోవంతు చైనీయులే. ఒకవేళ అక్కడికి వెళ్లినా.. సొంత దేశాన్ని వీడిన భావన వారిలో కలగదు. అందుకే ఎక్కువ మంది సింగపూర్ వైపే మొగ్గుచూపుతున్నారు.