కరోనా ఉగ్రరూపం, వచ్చే వారంలో లాక్ డౌన్!

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 09:35 AM IST
కరోనా ఉగ్రరూపం, వచ్చే వారంలో లాక్ డౌన్!

Boris Johnson considering lockdown for England : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇంగ్లాండ్ లో వచ్చే వారంలో లాక్ డౌన్ విధించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆలోచిస్తున్నారు.



కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతుండడంతో సీనియర్ కేబినెట్ సహచరులను శుక్రవారం కలిశారని Whitehall వర్గాలు వెల్లడిస్తున్నాయి. కఠిన నిబంధనలు విధించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలో Chancellor Rishi Sunak, Health Secretary Matt Hancock, Chancellor of the duchy of Lancaster Michael Gove తదితరులు పాల్గొన్నారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ లో అనుసరించాల్సిన విధానాలను చర్చించినట్లు తెలుస్తోంది.



ఈ క్రమంలో ప్రధాన మంత్రి బోరిస్ నవంబర్ 02వ తేదీ సోమవారం ఓ సమావేశం నిర్వహించగలరని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పలువురు వెల్లడిస్తున్నారు. శుక్రవారం 24 వేల 405 కొత్త కేసులు వెలుగు చూశాయి. 274 మరణాలు సంభవించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటువ్యాధి వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.