iPhones Without Charger: యాపిల్ సంస్థకు బ్రెజిల్ షాక్.. చార్జర్లు లేకుండా ఫోన్లు అమ్ముతున్నందుకు ఫైన్.. అమ్మకాలపై నిషేధం

ఛార్జర్లు లేకుండా ఐఫోన్లు విక్రయిస్తున్న యాపిల్ సంస్థకు షాక్ ఇచ్చింది బ్రెజిల్. దీనికిగాను ఆ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.

iPhones Without Charger: యాపిల్ సంస్థకు బ్రెజిల్ షాక్.. చార్జర్లు లేకుండా ఫోన్లు అమ్ముతున్నందుకు ఫైన్.. అమ్మకాలపై నిషేధం

iPhones Without Charger: యాపిల్ ఫోన్లు ఛార్జర్ లేకుండానే మార్కెట్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఏ దేశమూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. బ్రెజిల్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ఛార్జర్ లేకుండా తమ దేశంలో ఐఫోన్లు అమ్ముతున్నందుకుగాను యాపిల్ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది.

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ

ఛార్జర్లు లేకుండానే ఐఫోన్లు విక్రయించాలని యాపిల్ సంస్థ కొంతకాలం కిందట నిర్ణయించింది. దీంతో ఎంత ఖరీదుపెట్టి ఐఫోన్ కొన్నాసరే.. ఆ బాక్సులో ఛార్జర్ ఉండదు. ఛార్జర్‌ను విడిగా కొనుక్కోవాల్సిందే. ఈ నిర్ణయాన్ని వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నిరసన వ్యక్తమైనా యాపిల్ వెనక్కి తగ్గలేదు. ఛార్జర్లు లేకుండానే ఫోన్లు రిలీజ్ చేసింది. అనేక దేశాల్లో ఇలాగే ఫోన్లు విక్రయిస్తోంది యాపిల్. కానీ, బ్రెజిల్ మాత్రం ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఛార్జర్లు లేకుండా ఫోన్లు విక్రయిస్తున్నందుకుగాను రూ.19 కోట్లు (2.4 మిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఛార్జర్లు లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఛార్జర్ లేకుండా ఫోన్లు విక్రయించడమంటే వివక్షతో కూడిన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడమేనని బ్రెజిల్ అభిప్రాయపడింది.

Dog Bit A Child: చిన్నారిని కుక్క కరిచినా పట్టించుకోని యజమాని.. రూ.5వేలు ఫైన్.. వీడియో వైరల్

‘‘ఛార్జర్ ఇవ్వకపోవడమంటే పూర్తి ఉత్పత్తి/వస్తువును అందివ్వకపోవడమే. తమ బాధ్యతల్ని మరో సంస్థకు బదలాయించడమే. ఇది వినియోగదారుడిపై వివక్ష చూపడమే’’ అని బ్రెజిల్ అభిప్రాయపడింది. అయితే, పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఐఫోన్లతోపాటు చార్జర్ విక్రయించడం లేదని యాపిల్ తెలిపింది. దీనిపై కూడా బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కర్బన ఉద్గారాలు తగ్గించేందుకే ఛార్జర్ ఇవ్వడం లేదనడంలో న్యాయం లేదు. ఎందుకంటే ఛార్జర్‌ను ఇదే కంపెనీ వేరే మార్గంలో విక్రయిస్తోంది’’ అని బ్రెజిల్ ప్రభుత్వ వినియోగదారుల శాఖ తెలిపింది.