White-Tailed Deer : మరో ముప్పు.. దుప్పుల్లో కరోనా యాంటీబాడీలు, ఆందోళనలో సైంటిస్టులు

కరోనావైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త రూపాల్లో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అమెరికాలో

White-Tailed Deer : మరో ముప్పు.. దుప్పుల్లో కరోనా యాంటీబాడీలు, ఆందోళనలో సైంటిస్టులు

White Tailed Deer Covid

White-Tailed Deer Covid : కరోనావైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త రూపాల్లో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అమెరికాలో దుప్పుల‌కూ క‌రోనా సోకింది. వైట్ టెయిల్డ్ డీర్ శ‌రీరంలో క‌రోనా యాంటీబాడీలు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. దీంతో వాటికి క‌రోనా సోకి ఉండ‌వ‌చ్చ‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అమెరికాలోని మిచిగాన్‌, ఇల్లినాయిస్‌, న్యూయార్క్‌, పెన్సెల్వేనియా న‌గ‌రాల‌కు చెందిన దాదాపు 600కు పైగా దుప్పుల ర‌క్త న‌మూనాల‌ను అమెరికా వ్య‌వ‌సాయ విభాగం ( USDA ) ప‌రిశీలించింది. జ‌న‌వరి నుంచి మార్చి మ‌ధ్య ఈ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలించింది. వీటిలో దాదాపు 152 దుప్పుల్లో SARS-CoV-2 వైర‌స్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్న‌ట్లు గుర్తించారు.

‘క‌రోనా వైర‌స్‌ను ఆక‌ర్షించే ఎస్‌2 రెసిప్ట‌ర్లు దుప్పుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఒక‌వేళ వీటికి వైర‌స్ సోకినా.. వెంట‌నే అవి వాటితో పోరాడ‌గ‌ల‌వు. అంతేకాకుండా ఇవి వైర‌స్‌కు రిజ‌ర్వాయ‌ర్లుగా ఉండే అవ‌కాశం ఉంది. అంటే.. వ‌న్య‌ప్రాణుల‌కు వైర‌స్ సోకితే వాటి శ‌రీరంలో వైర‌స్ అలాగే రిజ‌ర్వ్‌గా ఉండిపోతుంది. ఇలా రిజ‌ర్వ్‌గా ఉండిపోవ‌డం వ‌ల్ల ఎప్ప‌టికైనా ముప్పే ఉంటుంద‌ని’ శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దుప్పుల్లో రిజ‌ర్వ్‌గా ఉన్న ఈ వైర‌స్ ఇత‌ర జంతువుల‌కు సోకి వాటి ద్వారా మ‌నుషుల‌కు సోకే అవ‌కాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్నే రివ‌ర్స్ జూనోసిస్ అని పిలుస్తారని చెప్పారు. ఇలా వ‌న్య‌ప్రాణుల నుంచి మ‌నుషుల‌కు సోకే క్ర‌మంలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. దీనివ‌ల్ల ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా.. కొత్త వేరియంట్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

”జూలై 9న తొమ్మిదేళ్ల టినో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడింది. దాని ముక్కు నుంచి నీరు కారుతోంది. ఆకలి మందగించింది. రెండు రోజుల తర్వాత 12ఏళ్ల హరిలోనూ అదే తరహా లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ రెండు పులులకు యాంటీబాడీస్, మల్టి విటమిన్స్ తో ట్రీట్ మెంచ్ ఇచ్చాం. 10 నుంచి 12 రోజుల తర్వాత అవి కోలుకున్నాయి. ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నాయని” అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కులో 8 ఆసియాటిక్ సింహాలు కరోనా బారిన పడ్డాయి. మనిషి నుంచి జంతువుకు వైరస్ సోకిందని అప్పుడే తొలిసారిగా తెలిసింది. లక్షణాలు కనిపించిన వెంటనే సింహాలను రెండు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచి ట్రీట్ మెంట్ ఇచ్చారు.