Giorgia Meloni: ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జార్జియా మెలోని

రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో ఇదే మొట్టమొదటి అతివాద ప్రభుత్వం. వివాదాస్పదమైన ‘గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం తన మంత్రి వర్గాన్ని శుక్రవారం ప్రకటించారు మెలోని. సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు రాగా, లీగ్, ఫోర్జా ఇటాలియాలకు ఐదు చొప్పున శాఖలు కేటాయించారు

Giorgia Meloni: ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జార్జియా మెలోని

Far-right leader Giorgia Meloni sworn in as Italy prime minister

Giorgia Meloni: ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన జార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇటలీ జాతీయ ఎన్నికల్లో అతివాద నేత మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమికి మొత్తంగా 43 శాతానికి పైగా ఓట్లు రాగా, మెలోని పార్టీకి 26.37 శాతం ఓట్లు వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో ఇదే మొట్టమొదటి అతివాద ప్రభుత్వం. వివాదాస్పదమైన ‘గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం తన మంత్రి వర్గాన్ని శుక్రవారం ప్రకటించారు మెలోని. సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు రాగా, లీగ్, ఫోర్జా ఇటాలియాలకు ఐదు చొప్పున శాఖలు కేటాయించారు. ఈ క్యాబినెట్‭లో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నారు.

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇటలీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని కావటం ఆమెకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విజయం సాధించి ప్రధాని అయిన మెలోని.. ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘దేశంలోని ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాల్సిన అసవరం ఎంతోఉందని మనం ఆరంభం స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.

Mayawati: బీజేపీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకే ఆర్‌ఎస్‌ఎస్ ఆ పని చేస్తోంది.. బీఎస్పీ చీఫ్ మాయావతి