Mu Covid Variant : ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, తొలి కేసు నమోదు, 40 దేశాలకు వ్యాప్తి

కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది

Mu Covid Variant : ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, తొలి కేసు నమోదు, 40 దేశాలకు వ్యాప్తి

Mu Covid Variant

Mu Covid Variant : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ మూ(ఎంయూ) ప్రపంచ దేశాలకు మెల్లగా వ్యాపిస్తోది. ఫిన్లాండ్‌లో ఎంయూ(Mu) వేరియంట్‌ తొలి కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిన దేశాల సంఖ్య 40కి చేరింది. శరీరం రోగనిరోధక ప్రతిస్పందనపై ప్రభావం కోసం అధ్యయనం చేయవలసిన కొన్ని ఉత్పరివర్తనాలను ఎంయూ వేరియంట్‌ కరోనా (బి.1.621) కలిగి ఉంది. ఈ నేపథ్యంలో దీనిని ఆసక్తి రేపుతున్న వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో వర్గీకరించింది. అయితే అంటు వ్యాధికి కారణమయ్యే ఈ వైరస్ వేరియంట్‌ ఇతర వైవిధ్యాలతో పోలిస్తే అదనపు ముప్పు కలిగించబోదని తెలిపింది.

దక్షిణ అమెరికాలోని కొలంబియాతో పాటు ఇతర దేశాల్లో ఎంయూ వేరియంట్‌ కరోనా కేసులు పెరుగుతుండటంపై WHO ఇప్పటికే ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్‌కు కరోనా నిరోధక టీకాలను ఏమార్చే గుణాలున్నాయని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపింది.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

ఇప్పటికే డెల్టా వేరియంట్ వంటి కొత్త వేరియంట్లతో భారత్, అమెరికా, ఇతర దేశాలు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. అమెరికాలో డెల్టా వేరియంట్ కారణంగా ప్రస్తుతం భారీ ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత కూడా ఏర్పడింది. వెంటిలేటర్ చికిత్స కూడా అందరికీ అందని పరిస్థితులు నెలకొంటున్నాయి.

Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

డెల్టా వేరియంట్ 170 దేశాల్లో ప్రభావితం చూపగా, ఆల్ఫా వేరియంట్ 193 దేశాల్లో విస్తరించింది. ఇది ఇలావుండగా, కొద్ది రోజుల క్రితమే వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న సీ.1.2గా పిలిచే మరో వేరియంట్ కూడా బయటపడింది. ఇది కూడా కరోనా వ్యాక్సిన్లకు లొంగే రకం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు ‘మూ’ వేరియంట్ వెలుగుచూడటం వైద్య నిపుణులకు సవాల్‌గా మారింది.