Bible : రూ.313 కోట్లకు అమ్ముడుపోయిన బైబిల్.. ఎందుకంత రేటు అంటే

Bible : ఈ హీబ్రూ బైబిల్‌ను సోత్ బే దక్కించుకుంది. USD 38.1 మిలియన్లకు (భారత కరెన్సీలో రూ. 313 కోట్లు) కొనుగోలు చేసింది.

Bible : రూ.313 కోట్లకు అమ్ముడుపోయిన బైబిల్.. ఎందుకంత రేటు అంటే

Bible(Photo : Google)

Hebrew Bible : అదొక బైబిల్. దాన్ని వేలం వేశారు. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. ఆ బైబిల్ రూ.313 కోట్లు పలికింది. ఎందుకు ఆ బైబిల్ అంత స్పెషల్ అంటే.. అది పురాతమైనది. 1100 ఏళ్ల క్రితం నాటిది. ఈ హీబ్రూ బైబిల్ 9వ శతాబ్దపు చివరి నుండి 10వ శతాబ్దం ప్రారంభంలో రాయబడింది. ఇది ప్రపంచంలోని పురాతన బైబిల్ మాన్యుస్క్రిప్ట్‌లలో ఒకటి.

రొమేనియాలో అమెరికా మాజీ రాయబారి ఆల్‌ఫ్రెడ్ మోసెస్ ఈ బైబిల్‌ను కొనుగోలు చేశారు. ఈ హీబ్రూ బైబిల్ ను అమెరికా న్యూయార్క్‌లోని ఆక్షన్ హౌస్‌లో వేలం వేశారు. ఈ బైబిల్ ను సొంతం చేసుకునేందుకు రెండు కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఈ హీబ్రూ బైబిల్‌ను సోత్ బే దక్కించుకుంది. USD 38.1 మిలియన్లకు (భారత కరెన్సీలో రూ. 313 కోట్లు) కొనుగోలు చేసింది. వేలంలో సొంతం చేసుకున్న ఈ బైబిల్ ను.. ఇజ్రాయెల్‌ టెల్ అవీవ్‌లోని యూదు మ్యూజియమ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు సోత్ బే వెల్లడించింది.

Also Read..Viral Video : బాబోయ్.. ప్రతీకారం తీర్చుకున్న గాడిద.. తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడికి ఆ గాడిద ఎలా బుద్ధి చెప్పిందో చూడండి

‘హిబ్రూ బైబిల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనది. ఇది పాశ్చాత్య నాగరికతకు పునాది. అది యూదులకు చెందినదని తెలిసి సంతోషించాను’ అని అమెరికా మాజీ రాయబారి మోసెస్ అన్నారు.