IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

ప్రపంచమంతా రెసిషన్ (మాంద్యం) తప్పదని తేలిపోయింది. మరి దాని ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది...? మన పక్కనున్న చైనా మనకంటే వృద్ధిలో ముందుంటుందా...? మన వృద్ధిరేటు కంటే చైనా వృద్ధిరేటు అంకెలు తక్కువగా ఉన్నాయి. ఆ అంకెల మాయాజాలం ఏంటి...?

IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

IMF..World Bank Warn of Increasing Risk of Global Recession

IMF Warns..Recession : ప్రపంచమంతా రెసిషన్ (Recession) (మాంద్యం) తప్పదని తేలిపోయింది. మరి దాని ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది…? మన పక్కనున్న డ్రాగన్‌ (చైనా) మనకంటే వృద్ధిలో ముందుంటుందా…? మన వృద్ధిరేటు కంటే చైనా వృద్ధిరేటు అంకెలు తక్కువగా ఉన్నాయి. ఆ అంకెల మాయాజాలం ఏంటి…?

ఆర్థిక మందగమన ముప్పు, ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు తగ్గడం… ఇవన్నీ మనకు సంబంధం లేని పదాలు అనుకోవద్దు… ఇందులోని ప్రతి పదం మన ఇంటి బడ్జెట్‌తో ప్రత్యక్షంగానే పరోక్షంగానే సంబంధం ఉన్నదే… కాబట్టి దీనికి మనం సిద్ధం కావాల్సిందే…International Monetary Fund (IMF) హెచ్చరికల ప్రకారం ఆర్థిక వృద్ధి విషయంలో ప్రపంచదేశాలు నెమ్మదిస్తున్న సమయంలో భారత్‌ కాస్త మెరుగైన స్థితిలో ఉందని IMF అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను 6.8శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పింది. జనవరిలో దీన్ని 8.2శాతంగా అంచనా వేసిన IMF.. జులైలో 7.4శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరో 0.6శాతం తగ్గించింది. అలాగే వచ్చే ఏడాదికి మన వృద్ధిరేటు 6.1శాతంగా ఉండొచ్చని IMF లెక్కగట్టింది. కానీ మిగిలిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే కొంచెం మేలే అనేది IMF లెక్క… చైనా వృద్ధిరేటు ఈ ఏడాది 3.2శాతంగా ఉంటే వచ్చే ఏడాది అది 4.4శాతానికి పెరగొచ్చని ఆర్థిక నిపుణులు లెక్కగట్టారు.

IMF Warns About Recession : ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుదేలవుతాయని హెచ్చరిస్తున్న IMF

అంకెల్లో చూడటానికి చైనాకంటే మనం చాలాబాగున్నట్లు కనిపిస్తుంది. కానీ చైనా ఆర్థిక వ్యవస్థ వేరు… మన ఆర్థిక వ్యవస్థ వేరు.. చైనా జీడీపీ 19.91 ట్రిలియన్ డాలర్లు…. కానీ మనది 3.469 ట్రిలియన్ డాలర్లే. అంటే మన వృద్ధిరేటు అంచనా పెద్దదిగా కనిపిస్తున్నా వాస్తవ వృద్ధి తక్కువే. చైనా వృద్ధిరేటు అంచనా తక్కువైనా వృద్ధి భారీగానే ఉంటుంది. పైగా IMF అంచనాల ప్రకారమే మన వృద్ధిరేటు ఈ ఏడాదితో పోల్చితే వచ్చే ఏడాది 0.7శాతం తక్కువగా ఉంటుంది. అంటే మన 3.469 ట్రిలియన్ జీడీపీలో వృద్ధి చాలా తక్కువ. కానీ చైనా వృద్ధిరేటు ఈ ఏడాదికంటే మరో 1.2శాతం పెరుగుతుంది. సుమారు 20ట్రిలియన్ డాలర్ల జీడీపీతో పోల్చుకుంటే ఏ స్థాయిలో పెరుగుతుందో అంచనా వేసుకోవచ్చు… అంటే ప్రపంచమంతా వృద్ధిరేటు పడిపోతుంటే వచ్చే ఏడాది వృద్ధిరేటు పెరిగే ఏకైక పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా అనే చెప్పాలి. IMF అంచనాల ప్రకారం యూకే వృద్ధి రేటు 3.6శాతం నుంచి 0.3శాతానికి పడిపోతుంది. అలాగే అమెరికా వృద్ధిరేటు 1.6శాతం నుంచి 1శాతానికి పడిపోతుంది. జర్మనీ, ఫ్రాన్స్‌, కెనడా, స్పెయిన్‌లది దాదాపు ఇదే పరిస్థితి. అంటే అందరికంటే కాస్త బ్రైట్‌గా కనిపిస్తోంది ఒక్క చైనానే..

మిగిలిన దేశాలతో పోల్చితే మన భారత ఆర్థిక మూలాలు కాస్త బలంగానే ఉన్నాయి. అందుకే 2008లో మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు మనం చాలావరకు దాన్నుంచి బయటపడ్డాం. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మన దగ్గర నిరుద్యోగం భారీస్థాయినలోనే పెరిగింది. రూపాయి విలువ కూడా పడిపోయింది. దీనికి తోడు విదేశీమారక ద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి. ఇవన్నీ మనకు డేంజర్‌బెల్స్‌ మోగిస్తున్నాయి. చైనా మినహా మన పొరుగుదేశాల దాదాపు అన్ని దేశాలదీ ఇదే పరిస్థితి… నిజానికి కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు. వ్యాపారాలు గాడిన పడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లమంది ఇంకా కుదురుకోలేదు. ఇంతలో మళ్లీ ఈ ముప్పు వచ్చి పడింది.

రెసిషన్ ప్రభావం ఇప్పటికే మనపై కనిపిస్తోంది. పెట్రోల్‌ నుంచి వంట నూనెల వరకు రేట్లు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం 7శాతానికి పైగా ఉంది. పారిశ్రామిక వృద్ధి తగ్గుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 82కి చేరింది. ఆర్థిక సంస్థలు మినహా మిగిలిన లిస్టెడ్ కంపెనీల లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 17శాతం తగ్గింది. గతేదాడి 422బిలియన్‌ డాలర్లతో ఆల్‌టైమ్‌ హైని టచ్‌ చేసిన ఎగుమతులు ఇప్పుడు నెమ్మదిస్తున్నాయి. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి ఛాలెంజింగ్ అంశాలే… ఇప్పటికే RBI భారీగా వడ్డీరేట్లు పెంచింది. దీంతో గృహరుణం మోయలేని స్థాయికి చేరింది. మరోసారి వడ్డీరేట్లు పెంచితే మాత్రం మధ్యతరగతి మానవులు మునిగిపోవడమే.

ఆర్థిక అల్లకల్లోల పరిస్థితుల అంచనాలతో విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం దేశీయంగా ఉద్యోగాలపై పడింది. లక్షల ఉద్యోగాలు ఇప్పటికే మాయమైపోతున్నాయి. ఎగబడి ఉద్యోగులను తీసుకునే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సంయమన మంత్రం పాటిస్తున్నాయి. పోటాపోటీగా జాబ్స్‌ ఇచ్చిన సంస్థలు నో వేకెన్సీ బోర్డులు పెట్టేశాయి. శాలరీల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పింక్‌స్లిప్‌లు ఇచ్చేస్తున్నాయి. మే నెల నుంచి తీసుకుంటే వరుసగా ఐదునెలలు ఐటీ ఉద్యోగాల్లో కోత కనిపిస్తోంది. కోవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగ కల్పన పడిపోవడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్‌లో అయితే ఏకంగా ఈ ఒక్కరంగంలోనే 2లక్షల 10వేల ఉద్యోగాలు మందగమన మంటల్లో కలసిపోయాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి హాస్పిటాలిటీ, టూరిజం, ఆటో, తయారీ రంగాల్లో ఈ స్థాయి పరిస్థితి లేకపోయినా రెసిషన్ ముంచెత్తితే మాత్రం అవి కూడా తల్లకిందులవడం ఖాయం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రెసిషన్ అంటేనే మందగమనం… ఇది ఎన్నాళ్లుంటుందన్నది చెప్పలేం. అది నెలలు కావచ్చు… సంవత్సరాలు కావొచ్చు… కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్నిరోజుల పాటు ఖర్చులను నియంత్రించడం అలవాటు చేసుకోవాలి. జీతంలో కొంతభాగం పొదుపుకు వెళ్లిపోవాల్సిందే. అనుకోని పరిస్థితులు తలెత్తి ఆదాయం తగ్గినా, ఆగిపోయినా ఆదుకునేలా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలి.

కనీసం ఆరునెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. చిన్న మదుపరులు, నష్టాన్ని తట్టుకోలేనివారు అనిశ్చిత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉంటే మంచిది. ఏదైనా ముప్పు తప్పదని తెలిసినప్పుడు దానికి సిద్ధం కావడమే మనం చేయాల్సింది. తప్పించుకోలేనప్పుడు ఎలా బయటపడాలన్నది చూసుకోవాల్సిందే… కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే మానసికంగా సిద్ధమవ్వండి.