India Military : అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో మూడో స్థానంలో భారత్..

అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. సరిహద్దుల్లో కవ్వించి రెచ్చగొట్టే చైనా, పాకిస్థాన్ దేశాలకు చెక్ పెట్టాలంటే ఆమాత్రం తప్పదనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే..గల్వాన్, తవాంగ్ లో చైనా కుట్రలు..వంటి ఘటనలు భారత్ ఆర్మీని బలంగా మారుస్తున్నాయి. ఎప్పుడూ శాంతి పతాకాలే కాదు యుద్ధానికి సిద్ధమవ్వటానికి ఉసిగొలుపుతున్నాయి.

India Military : అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో మూడో స్థానంలో భారత్..

India 3rd largest military spender

India third largest military spender : రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంత ఖర్చు ఎందుకు అనుకోవచ్చు. కానీ పాకిస్థాన్, చైనా వంటి భారత్ సరిహద్దు దేశాల కుట్రలను తిప్పి కొట్టటానికి ఇది చాలా అవసరమనే చెప్పాలి. సరిహద్దుల్లో పాకిస్థాన్ చేసే కుట్రలను భారత్ సైనికులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతునే ఉన్నారు. మరోపక్క చైనా..కమ్యూనిస్టు దేశమని చెప్పుకునే చైనా భారత్ సరిహద్దల్లో చేసే కుట్రలు అన్నీ ఇన్నీకావు. అప్పడు గల్వాన్ లోనూ…ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లోనే చైనా సైనికులు చేసే కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. అయినాచైనా దూకుడుని..కుట్రలకు చెక్ పెట్టాలంటూ రక్షణరంగంపై ఖర్చు పెట్టకతప్పదు. అందుకే భారత్ అమెరికా, చైనా తరువాత రక్షణ రంగంలో ఎక్కువగా ఖర్చు పెట్టేదేశంగా మారింది. ఒకప్పుడు విదేశాలనుంచి ఆయుధాలను కొనుగోలు చేసే భారత్ ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటోంది. ఇతరదేశాలకు కూడా విక్రయించే స్థాయికి చేరుకుంది.అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటానికికారణ సరిహద్దుల్లో కవ్వించి రెచ్చగొట్టే చైనా, పాకిస్థాన్ దేశాలకు చెక్ పెట్టాలంటే ఆమాత్రం తప్పదనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే..గల్వాన్, తవాంగ్ లో చైనా కుట్రలు..వంటి ఘటనలు భారత్ ఆర్మీని బలంగా మారుస్తున్నాయి. ఎప్పుడూ శాంతి పతాకాలే కాదు యుద్ధానికి సిద్ధమవ్వటానికి ఉసిగొలుపుతున్నాయి.

అప్పుడు గల్వాన్‌.. ఇప్పుడు అరుణాచల్‌లోని తవాంగ్‌.. ప్లేస్ ఏదైనా.. సరిహద్దుల్లో భారత్ తొడగొడుతోంది. మన జవాన్లను ఎదుర్కోలేక.. డ్రాగన్ సేనలు తోకముడుస్తూనే ఉన్నాయ్. రెండున్నరేళ్ల కిందట గల్వాన్‌లో ప్రతిష్టంభన సమయంలోనే బీజింగ్‌కు స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్లింది. ఇప్పుడు.. తవాంగ్ సెక్టార్‌లోనూ అదే సీన్ రిపీటైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాతో కయ్యమంటే.. అంత ఈజీ కాదు. బోర్డర్‌లో క్లాష్‌ మొదలైతే.. స్మాష్ అయ్యేది తామేనని చైనాకు కూడా తెలుసు. కానీ.. భయం లేనట్టు డ్రామాలాడుతోంది. ఎల్ఏసీ దాటొచ్చేందుకు ట్రై చేస్తోంది.

Indian Army Gets New Weapons : చైనాకు చుక్కలే..! ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్

సరిహద్దు గొడవలంటే.. ఇన్నాళ్లూ పాకిస్థాన్ ముందుండేది. ఇప్పుడు ఆ స్థానంలోకి చైనా వచ్చి చేరింది. 1962 వార్ తర్వాత.. దశాబ్దాల పాటు సైలెంట్‌గా ఉన్న చైనా.. ఐదేళ్లుగా బోర్డర్‌లో రెచ్చిపోతోంది. అయితే.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌ను మార్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ.. చైనా ఆర్మీకి షాక్ తగులుతోంది. సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ చూపుతున్న ధైర్య సాహసాలు చూసి.. డ్రాగన్ అవాక్కవుతోంది. ఇండియాను తేలిగ్గా తీసుకోవద్దన్న విషయం కూడా ఈపాటికే అర్థమైపోయింది. 2020 జూన్‌లో.. గల్వాన్ ఘర్షణలోనే భారత జవాన్లు చైనా బలగాలకు చుక్కలు చూపించారు. ఆ ఒక్క ఫైట్‌‍తో.. చైనాకు అసలు సీనేంటో అర్థమైపోయింది. ఇప్పుడు.. తవాంగ్ సెక్టార్‌లోనూ అదే జరిగింది. దీంతో.. ఇండియాతో అంత ఈజీ కాదనే విషయం అర్థమైపోయింది.

Agni-5 Ballistic Missile : అగ్ని-5 మిస్సైల్ టెస్ట్‌ సక్సెస్‌తో ఇక చైనాకు చుక్కలే… బోర్డర్‌లో క్లాష్‌ మొదలైతే.. స్మాష్ చేస్తామంటూ భారత్ వార్నింగ్

ఎల్ఏసీ వెంబడి.. ఉద్రిక్తతలు సృష్టించడం చైనాకు కొత్తేమీ కాదు. 2017 నుంచి ఇదీ మరీ ఎక్కువైంది. ఏడాది, ఏడాదిన్నర గ్యాప్ ఇవ్వడం.. ఏదో ఒక చోట వాస్తవాధీన రేఖ మార్చేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారింది. 2017 ఆగస్టులో.. డోక్లాం బోర్డర్‌లో ప్రతిష్టంభన సృష్టించింది. అప్పుడు కూడా భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ తలెత్తింది. 2020 జూన్‌లో.. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లోనూ ఇలాగే ఉద్రిక్తతలు సృష్టించింది. దీంతో.. రెండు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం భారీగానే చవిచూసిందనే కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు తవాంగ్ సెక్టార్‌లోనూ సైన్యం మధ్య ఘర్షణ తలెత్తింది. కానీ.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. అయితే.. గత నెల చైనా సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో.. అమెరికా, భారత్ ఆర్మీ కలిసి జాయింట్ డ్రిల్స్ నిర్వహించాయి. ఇదే.. బీజింగ్ రెచ్చగొట్టి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ జాయింట్ ఆర్మీ డ్రిల్స్ జరిగిన కొన్నాళ్లకే.. తవాంగ్‌లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

ఇన్నాళ్లూ.. సరిహద్దుల్లో చైనా సైనికులు ఎన్నిసార్లు కవ్వించినా.. ఇండియా చూస్తూ ఊరుకుంది. బోర్డర్లో మన సైన్యం అడ్డుకునే ప్రయత్నం చేసిందే తప్ప.. ఎలాంటి దాడికి దిగలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్. ఇండియాతో కయ్యానికి కాలు దువ్వితే.. చావు దెబ్బ తప్పదని.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి, చైనా ప్రభుత్వానికి క్లియర్‌గా అర్థమైపోయింది. ఇండియన్ ఆర్మీ ఆయుధాలు సమకూర్చుకోవడం, సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను ప్రదర్శించడం, పరిస్థితి దిగజారితే.. వెనక్కి తగ్గకుండా పోరాడేందుకు ఇండియా సిద్ధంగా ఉందని.. చైనా గ్రహించింది. భారత్ కూడా ఎప్పుడేం జరిగినా.. వెంటనే తిప్పికొట్టేందుకు రెడీ అయింది. మొదట్లో.. చైనానే ఇండియాను భయపెట్టాలని చూసింది. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చైనా గుంటనక్క వేషాలకు.. ఇండియా బెదిరేది లేదని ఇంకాస్త క్లియర్‌గా అర్థమైంది. కవ్విస్తే.. ఖతర్నాక్ ఆన్సర్ తప్పదనే సిగ్నల్ ఇచ్చింది. ఇది.. చైనాకు బలంగా తాకింది. అందుకే.. తవాంగ్‌లో రిస్క్ తీసుకోలేదు. ఓవరాక్షన్ చేసినా.. ఓవర్‌గా రియాక్ట్ కాలేదు. అయితే.. గల్వాన్ పరిస్థితులు రిపీట్ అవుతాయని చైనా సేనలకు బాగా తెలుసు.

Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

శత్రువులు దాడి చేస్తే.. శాంతి జెండా ఎగరేసే రోజులు పోయాయ్. బోర్డర్ క్రాస్ చేస్తే.. దౌత్యపరమైన పరిష్కారాల కోసం ఆగట్లేదు. కవ్విస్తే.. సైలెంట్‌గా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటి ఇండియా.. ఒకప్పటిలా లేదు.. శత్రుదేశాల సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిదాడులే సమాధానమని నమ్ముతోంది. కవ్విస్తూ.. దుందుడుకుతనం చూపిస్తే.. దూకుడుగా దమ్మేంటో చూపిస్తోంది. అందుకే.. బోర్డర్లో భారత్ బలంగా ఉంది. ఇండియన్ ఆర్మీ ధైర్యంగా నిల్చుంది. సమయం సరదా పడితే.. సమరంలో గెలిచేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం.. రక్షణ రంగంపై భారత్ భారీగా ఖర్చు పెడుతోంది. ఆయుధాలు కొనుగోలు చేసేందుకైనా, సొంతంగా తయారుచేసుకునేందుకైనా ఎక్కువగా ఆలోచించడం లేదు. అమెరికా, చైనా తర్వాత.. రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతేకాదు.. దేశ జీడీపీలో దాదాపు 2.7 శాతం మిలటరీ అవసరాల కోసం ఖర్చు పెడుతున్న దేశాల్లోనూ భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక.. ప్రపంచంలో భారీ స్థాయిలో ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లోనూ భారత్ ముందువరుసలో ఉంది. ఈ చర్యలన్నీ.. భారత సైనిక సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు చైనా, పాకిస్థాన్ నుంచి వస్తున్న ముప్పును.. తిప్పికొట్టేందుకు కూడా ఉపయోగపడుతున్నాయ్.

Made In India F-INSAS..Nipun : చైనాకు చెక్ పెట్టటానికి లద్దాఖ్ సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

వాస్తవాధీన రేఖ దాటొస్తే.. ఇండియన్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో.. మన సైనికులు చూపించారు. ఇండియా ల్యాండ్‌లోకి అక్రమంగా ఎవరు ఎంటరైనా సరే.. స్ట్రాంగ్ కౌంటర్ తప్పదనే స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చారు. ఇండో-చైనా బోర్డర్ ఉద్రిక్తతలతో మన సైనికుల సత్తా ఏంటో.. ఒక్క డ్రాగన్‌కే కాదు.. మరోసారి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలపై దాడి చేయలేదు. ఏ దేశ భూభాగాలను ఆక్రమించుకోలేదు. ఇండియా ఎప్పుడూ శాంతినే కోరుకుంది. అంతే తప్ప.. పొరుగు దేశాల ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడం ఇండియాకు అస్సలు ఇష్టముండదు. అలాగని.. శత్రువులు దాడి చేస్తే వారికేమీ లొంగిపోదు. దీటుగా సమాధానం చెబుతుంది. ఇందుకు.. లేటెస్ట్ తవాంగ్ సెక్టార్ ఘటనే ఎగ్జాంపుల్. సరిహద్దుల్లో డ్రాగన్ తోకజాడిస్తే.. కత్తిరిస్తామని చాలా క్లియర్‌గా చెప్పేసింది ఇండియన్ ఆర్మీ. బోర్డర్ విషయంలో ఎవరొచ్చినా సరే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేందుకు ఇండియా రెడీగా ఉంది.