US H-1B visa : యూఎస్ హెచ్-1బి వీసాదారులకు శుభవార్త

యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది....

US H-1B visa : యూఎస్ హెచ్-1బి వీసాదారులకు శుభవార్త

US H-1B visa

US H-1B visa holders : యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (Indians to benefit)

Encounter : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్…నలుగురు ఉగ్రవాదుల హతం

కెనడా ప్రభుత్వం 10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. యూఎస్ వీసాదారుల్లో ఉన్న సాంకేతిక ప్రతిభను ఆకర్షించడానికి కెనడా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. అత్యంత నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షించడానికి కెనడా యూఎస్ నుంచి హెచ్ 1 బి వీసా హోల్డర్లకు (US H-1B visa holders) ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. (can now work and live in Canada)

Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…

యూఎస్ వీసా ఉన్న వారు మూడు సంవత్సరాల పాటు కెనడాలో పనిచేసేందుకు అనుమతించనుంది. 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్‌లు, వారితో పాటు ఉన్ కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడియన్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. యూఎస్ వీసాదారులు కెనడాలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు వీలుగా తాత్కాలిక నివాస వీసా ఇస్తారు.

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో చిరుతపులి దాడి..12 మందికి గాయాలు

భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. కెనడాలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో అగ్రగామిగా ఎదగాలని ఆశిస్తోంది. దీనిలో భాగంగానే యూఎస్ టెక్ దిగ్గజాలను ఆకర్షించేందుకు కెనడా ఈ పథకాన్ని ప్రారంభించింది.