Sugar Free Mango : మధుమేహం వారికి గుడ్ న్యూస్, చక్కెర లేని మామిడిపండ్లు

‘మధుమేహం’తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.

Sugar Free Mango : మధుమేహం వారికి గుడ్ న్యూస్, చక్కెర లేని మామిడిపండ్లు

Mango

Sugar Free Mango: పండ్లలో రాజు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మామిడి పండు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. నిగనిగలాడే ఈ పండ్లను చూసిన వారు నోరు ఊరుతుంటుంది. చాలా మంది ఈ పండ్లను ఇష్టంగా తింటుంటారు. కానీ ‘మధుమేహం’ తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.

అయితే..ఇలాంటి భయం అవసరం లేదంటోంది. అలాంటి మామిడి పండ్లను పండిస్తున్నారు. కేవలం 4 నుంచి 6 శాతం చక్కెర స్థాయి కలిగిన మూడు రకాల చక్కెర రహిత..మామిడి పండ్లను ఓ నిపుణుడైన రైతు పండిస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే..భారతదేశంలో కాదు. పక్కనే ఉన్న పొరుగుదేశం పాక్ లో. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇది ఉపశమనం కలిగించనుందని అంటున్నారు. ఈ మామిడి పండ్ల పేర్లు సోనారో, గ్లెన్, కీట్, సింధ్ టాండో అల్లాహార్ లోని ఎంహెచ్ పన్వర్ ప్రైవేటు వ్యవసాయక్షేత్రంలో శాస్త్రీయ మార్పు చేసిన అనంతరం ఈ రకం మామిడి పండ్లను ..పండిస్తున్నారు.

మామిడి, అరటితో పాటు వివిధ పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సీతారా-ఏ-ఇమ్తియాజ్‌ను పన్వర్‌కు ప్రదానం చేసిందని, ఇతని మరణం తర్వాత..అతడి పనిని కొనసాగించినట్లు ఎంహెచ్ పన్వర్ వ్యవసాయ క్షేత్రం మామిడి నిపుణుడు గులాం సర్వర్ వెల్లడించారు. ఇక్కడి వాతావరణం, మట్టిలో దాని పెరుగుదలను పరీక్షించడానికి విదేశాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లను దిగుమతి చేసుకున్న అనంతరం శాస్త్రీయంగా మార్పు చేయడం జరిగిందన్నారు.