Iran Hijab: హిజాబ్ ధరించని కస్టమర్‌కు సర్వీస్ చేసిన బ్యాంక్ మేనేజర్.. విధుల్లోంచి తొలగించిన ఇరాన్ ప్రభుత్వం

హిజాబ్ విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. హిజాబ్ ధరించని ఒక మహిళకు సర్వీస్ చేసినందుకు బ్యాంక్ మేనేజర్‌ను ఉద్యోగంలోంచి తీసేసింది ఇరాన్ ప్రభుత్వం.

Iran Hijab: హిజాబ్ ధరించని కస్టమర్‌కు సర్వీస్ చేసిన బ్యాంక్ మేనేజర్.. విధుల్లోంచి తొలగించిన ఇరాన్ ప్రభుత్వం

Iran Hijab: ఒక పక్క ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పట్లాగే హిజాబ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా హిజాబ్ ధరించని ఒక మహిళకు సర్వీస్ చేసినందుకు బ్యాంక్ ఉద్యోగిని విధుల్లోంచి తొలగించింది.

Honey Trapping: హనీ ట్రాపింగ్‌కు పాల్పడ్డ యూట్యూబ్ కపుల్.. వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలు వసూలు

‘‘పూర్తిగా హిజాబ్ ధరించని ఒక మహిళకు బ్యాంక్ ఉద్యోగి ఒకరు సర్వీస్ చేశారు. దీంతో అతడిని విధుల్లోంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు’’ అని స్థానిక మీడియా పేర్కొంది. గత గురువారం టెహ్రాన్ సమీపంలోని క్వోమ్ ప్రావిన్స్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విధుల్లోంచి తొలగించిన ఉద్యోగి బ్యాంక్ మేనేజర్ అని తెలుస్తోంది. ఇరాన్‌లో ఎక్కువ శాతం బ్యాంకులు ప్రభుత్వ అధీనంలోనే పనిచేస్తాయి. నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోకి వచ్చే మహిళలు తప్పనిసరిగా పూర్తిగా హిజాబ్ ధరించాలి. జుట్టు కూడా కనిపించకూడదు. ఒకవేళ హిజాబ్ సరిగ్గా ధరించని మహిళలకు బ్యాంకు సేవలు అందిస్తే దీనికి బ్యాంకు మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Maharashtra: రైల్వే స్టేషన్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 20 మందికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం

దీంతో తాజా ఘటనలో బ్యాంక్ మేనేజర్‌ను విధుల్లోంచి తొలగించారు. అయితే, ఈ ఘటన మరింత చర్చకు దారి తీసింది. ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చిత్ర హింసలకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడి మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కొందరు పురుషులు, స్త్రీలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సైనిక బలగాల్ని ప్రయోగిస్తోంది. సైనికుల కాల్పుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఉద్యమం కొనసాగుతూనే ఉంది.