Srilanka : భారత్ తీరాన్ని తాకిన లంక సంక్షోభం

శ్రీలంకలో పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆ దేశంనుంచి వేలాదిమంది భారత తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేకపోగా... నిత్యావసర వస్తువుల...

Srilanka : భారత్ తీరాన్ని తాకిన లంక సంక్షోభం

Srilanka

Sri Lanka Economic : శ్రీలంక సంక్షోభం…భారత తీరాన్ని తాకింది. స్వదేశంలో బతికే పరిస్థితులు లేక…జాఫ్నా, మన్నార్‌ ప్రాంతాలకు చెందిన తమిళులు భారత్‌కు చేరుకుంటున్నారు. రెండు బ్యాచ్‌లుగా మొత్తం 16 మంది తమిళనాడు తీరానికి చేరుకున్నారు. మొదటి బ్యాచ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు వున్నారు. రెండో బ్యాచ్‌లో ముగ్గురు మహిళలు, అయిదుగురు చిన్నారులు వున్నారు. కోస్టల్‌ గార్డ్స్‌ వారిని సముద్ర జలాలనుంచి రక్షించి రామేశ్వరం వద్ద తీరానికి చేర్చారు. స్వదేశంనుంచి పడవలో రావడానికి 50 వేల రూపాయలు చెల్లించామని శ్రీలంక తమిళ శరణార్థులు చెబుతున్నారు.

Read More : Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం

శ్రీలంకలో పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆ దేశంనుంచి వేలాదిమంది భారత తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేకపోగా… నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో శ్రీలంకలోని పౌరులు భారత్‌లోకి ప్రవేశించడానికి దారులు వెతుక్కుంటున్నారు. కరోనాతో కుదేలైన ఆ దేశ ఆర్థిక పరిస్థితి – రష్యా యుక్రెయిన్‌ యుద్ధంతో మరింత తీవ్రస్థాయికి చేరుకుంది.

Read More : Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు

ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయికి చేరుకుని చరిత్రలో ఎన్నడూలేని విధంగా ధరలు చుక్కలను అంటాయి. పెట్రో ఉత్పత్తులనుంచి నిత్యావసర వస్తువుల వరకు దారుణంగా ధరలు పెరిగిపోయి సాధారణ ప్రజలు బతికే పరిస్థితులు లేకుండాపోయాయి. శ్రీలంకలో లీటర్‌ పెట్రోలు 283 రూపాయలకు, లీటర్‌ డీజిల్‌ 220 రూపాయలకు అమ్ముతున్నారు. చికెన్‌ 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుండగా కోడిగుడ్డు ధర 35 రూపాయలు చేరుకుంది. కేజీ ఉల్లిపాయలు 200 నుంచి 250 రూపాయలుగా ఉంది. వంట గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లలో ఓ కప్పు పాలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.