Viral Video : ఇంజన్ ఫెయిల్ అవటంతో హైవేపై అత్యవసరంగా ల్యాండైన విమానం

అమెరికాలోని  నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో   హైవే పై వాహనాలు   వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక సింగిల్   ఇంజన్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయ్యింది.

Viral  Video : ఇంజన్ ఫెయిల్ అవటంతో హైవేపై అత్యవసరంగా ల్యాండైన విమానం

Viral Video

Updated On : July 12, 2022 / 4:06 PM IST

Viral North Carolina Video :  రోడ్డు మీద వెళ్లేప్పుడు వాహనం చెడిపోతేనో,  ఇంజన్ ట్రబుల్ ఇస్తేనో వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి మిగిలిన వాటికి దారి ఇస్తాం.. అదే ఆకాశంలో ఎగురుతున్న విమానం   ఇంజన్ ట్రబుల్ ఇస్తే…..  అమ్మో …ఊహించుకోటానికే భయం వేస్తుంది.  కానీ ఒక సింగిల్ ఇంజన్ విమానం ఆకాశంలో ఎగురుతుండగా ఇంజన్ ట్రబుల్ ఇవ్వటంతో పైలట్ దాన్ని చాకచక్యంగా హైవేపై దించాడు.  అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలోని  నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో   హైవే పై వాహనాలు   వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక సింగిల్   ఇంజన్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయ్యింది.   ఆ  విమానంలో విసెంట్ ప్రేజర్ అనే వ్యక్తి  ప్రయాణిస్తున్నాడు.   ఆకాశంలోప్రయాణిస్తుండగా విమానం ఇంజన్ ఫెయిలయ్యింది. దగ్గరలో ఎక్కడా విమానాశ్రయం లేదు.
Also Read : Mango Leaves : మామిడి ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
కిందకు చూస్తే హైవే కనపడింది. అంతే    వెంటనే దాన్ని రోడ్డుపై దించేయాలని డిసైడ్ అయ్యాడు. రోడ్డుపై వెళుతున్నకార్లు, ఎత్తైన కరెంట్ తీగలు తప్పించుకుంటూ   జాగ్రత్తగా విమానాన్ని  రోడ్డుపైకి ల్యాండ్  చేశాడు.

Flight On Road

Flight On Road

ఈ వీడియోను పేస్ బుక్ లో షేర్ చేసిన ఆ సిటీ పోలీసులు ….ల్యాండ్ అయ్యే సమయంలో కరెంట్ తీగలు తగిలినా..ప్రయాణిస్తున్న వాహనాలకు కారు తగిలినా ఎంతో ప్రమాదం జరిగి ఉండేదని… అదృష్టవశాత్తు అలాంటి ప్రమాదమేమీ జరగలేదన్నారు. ప్రస్తుతం సోషల్    మీడియాలో  వైరల్ అవుతున్న ఈవీడియోలో  పైలట్ చాకచక్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి…..