Nepal: మాట్లాడనివ్వడం లేదని పార్లమెంటులోనే బట్టలు విప్పేసిన ఎంపీ
స్వతంత్ర ఎంపీ అయిన అమ్రేష్ కుమార్ సింగ్.. పార్లమెంటులో తన గొంతు వినిపించడానికి అనేకసార్లు చాలా ప్రయత్నించారు. కానీ తనకు అవకాశం దొరకడం లేదు. తాజాగా సోమవారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అవకాశం ఇవ్వలేదు.

Independent MP in Nepal, Amresh Kumar Singh
Nepal: చట్టసభల్లో విపక్షాల వారి మైకులు కట్ చేయడం, వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం లాంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు ప్రతిగా విపక్షాలకు చెందిన చట్టసభ సభ్యులు, సభలోనే నిరసన తెలపడం లేదంటే సభ నుంచి వాకౌట్ చేయడం లాంటివి తరుచూ జరిగేవే. అయితే నేపాల్ దేశానికి చెందిన ఒక ఎంపీకి ఇలాంటి అనుభవమే (మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు) ఎదురైంది. అందుకు ఆయన సభలోనే నిరసన తెలియజేశారు కానీ, చాలా భిన్నంగా తెలిపిన ఆ వ్యతిరేకత మీద తీవ్ర చర్చ సాగుతోంది.
Uttar Pradesh : కన్న కొడుకును హత్య చేసిన తల్లి .. సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న తండ్రి
స్వతంత్ర ఎంపీ అయిన అమ్రేష్ కుమార్ సింగ్.. పార్లమెంటులో తన గొంతు వినిపించడానికి అనేకసార్లు చాలా ప్రయత్నించారు. కానీ తనకు అవకాశం దొరకడం లేదు. తాజాగా సోమవారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్లమెంటులోనే ఆయన చొక్కా విప్పి నిరసన తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రతినిధుల సభ స్పీకర్ దేవరాజ్ ఘిమిరే తనను మాట్లాడటానికి అనుమతించకపోవడంతో తన బట్టలు విప్పినట్లు ఆయన వెల్లడించారు.
“ప్రతినిధుల సభ సమావేశంలో మర్యాదగా ప్రవర్తించకుంటే చర్యలు తీసుకుంటామని ఘిమిరే హెచ్చరించారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నేను అమరవీరుడు కావడానికి సిద్ధంగా ఉన్నాను” అని సింగ్ తన బట్టలు విప్పే ముందు అమ్రేష్ అన్నారు. బట్టలు విప్పే ముందు పార్లమెంటరీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ ఘిమిరే కోరారు. అయినప్పటికీ స్పీకర్ చేసిన అభ్యర్థనను నిరాకరించి తన బట్టలు విప్పడం ప్రారంభించారు. నేపాల్ పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!
నేపాలీ కాంగ్రెస్ మాజీ నాయకుడు అయిన అమ్రేష్ కుమార్ సింగ్, నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. అయితే ఎన్నికల ముందు ఆయనకు టికెట్ నిరాకరించడంతో సర్లాహి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈయన మన దేశంలోనే చదువుతున్నారు. రాజధాని ఢిల్లీలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు.