kim jong un : కిమ్..మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్‌ ట్రేషన్ చేస్తున్నాడు..? నియంత టార్గెట్ అదేనా..?!

కిమ్‌ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్‌ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి?

kim jong un : కిమ్..మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్‌ ట్రేషన్ చేస్తున్నాడు..? నియంత టార్గెట్ అదేనా..?!

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day (1)

North korea : కిమ్‌ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్‌ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి? తల ఎగరేస్తున్న అమెరికాను.. తల దించుకుని చర్చలకు వచ్చేలా చేయడమే కిమ్ టార్గెటా?

అమెరికాను డోంట్ కేర్ అంటున్న కిమ్..బైడెన్ ఆసియా టూర్‌ తర్వాత 3 అణు పరీక్షలు..తాజాగా అమెరికా, దక్షిణ కొరియా ఆర్మీ డ్రిల్స్‌కు కౌంటర్ ఆపరేషన్..ఐక్యరాజ్యసమితి, అమెరికాపై ఒత్తిడి తెచ్చేలా కిమ్ ఆపరేషన్స్‌..ఉత్తర కొరియాపై ఆంక్షలను ఎత్తివేసేలా చేయడమే టార్గెట్..అగ్రరాజ్యం అమెరికాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లైట్ తీసుకుంటున్నారు. క్షిపణుల ప్రయోగాలను ఆపివేయాలన్న అమెరికా హెచ్చరిలను డోంట్ కేర్ అంటున్నాడు. పైగా వరుస ప్రయోగాలు చేస్తూ.. సరికొత్త సవాల్ విసురుతున్నాడు. మే 25న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆసియా పర్యటన ముగించిన తరువాత కూడా మూడు అణు పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా 31సార్లు క్షిపణి పరీక్షలను చేపట్టింది. వాటిలో అతి పెద్ద ఖండాంతర క్షిపణి-ICBMతో సహా పలు రకాల మిస్సైళ్లు ఉన్నాయి. బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కిమ్‌ ఉన్నట్లు కనిపిస్తోంది.

Also read : kim jong un : ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న నార్త్ కొరియా నియంత ‘కిమ్’..6 నెలల్లో 31 మిసైల్స్ ప్రయోగాలు

ఒకే రోజు వరుసగా 8మిసైల్స్ ప్రయోగించి అమెరికాను ఇరకాటంలో పడేశాడు కిమ్. కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫిలిప్పీన్స్ సముద్రంలో తన ఫస్ట్ జాయింట్ ఆర్మీ డ్రిల్ చేశాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. దీనికి కౌంటర్‌ ఇస్తూ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా, దక్షిణ కొరియా ఆపరేషన్స్ ముగించిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేసింది. ఆదివారం తన తూర్పు తీరంలో ఈ ప్రయోగం చేసినట్లుగా ఉత్తర కొరియా సైన్యం ప్రకటించింది. గత నెలలో ఉత్తర కొరియా మూడు క్షిపణులను పరీక్షించి భయాందోళనలు సృష్టించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-17 కూడా ఉంది. కిమ్ జోంగ్ ఉన్ సిద్ధాంతం ఉత్తర కొరియాను అణుశక్తిగా, ఆర్థిక, భద్రతను అధికార స్థానం నుంచి అంగీకరించేలా అమెరికాను ప్రోత్సహించడమే లక్ష్యంగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

అసలు అక్కడెక్కడో ఉత్తరకొరియా మిస్సైల్స్‌ ప్రయోగిస్తుంటే అమెరికాకు వచ్చిన నష్టమేంటి? మిసైల్స్ ప్రయోగిస్తే అమెరికాపై ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే.. కచ్చితంగా పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా హెచ్చరికలు పక్కన పెట్టి మరీ అణ్వాయుధ ప్రయోగాలు చేస్తోంది ఉత్తర అమెరికా. అంటే అమెరికాను తాము కేర్‌ చేయడం లేదని స్పష్టంగా చెబుతోంది. దీన్ని అమెరికా లైట్‌ తీసుకుంటే… రేపొద్దున్న మరో దేశం ఇలానే చేస్తుంది. అప్పుడు పెద్దన్న అనే పదానికి అర్థమే ఉండదు. ఇప్పుడు ఉత్తరకొరియాను బెదిరించో… బతిమిలాడో.. క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఆపాలి. లేదంటే అమెరికా పరువు మొత్తం పోతుంది. అటు కిమ్‌ మాత్రం అమెరికా తన కాళ్ల బేరానికి రావాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే కానీ… అమెరికాకు తలొంచే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది కిమ్ తీరు.

Also read : kim jong un : నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాల్లో బిజీ బిజీగా కిమ్

కిమ్‌ చర్యలతో అమెరికానే కాదు దక్షిణ కొరియా, జపాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అణు పరీక్షలతో ఐక్యరాజ్యసమితి, అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు కిమ్‌ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా చేయాలనే కిమ్‌ ఉద్దేశంలా ఉంది. ఇలాంటి సంక్షోభాలు సృష్టించి తనకు కావాల్సింది చేసుకోవడం ఉత్తరకొరియాకు కొత్తేమీ కాదు. 2010లో దక్షిణ కొరియా నౌకాదళ కొర్వెట్ చియోనాన్‌ను నార్త్ కొరియా ముంచింది. ఆపై కొన్ని నెలల పాటు బయట ద్వీపాలపై బాంబులతో దాడి చేసింది. ఆ తర్వాత 2017లో జపాన్‌ మీదుగా లాంగ్‌ రేంజ్‌ మిస్సైల్‌ ప్రయోగించి… జపాన్‌నే హెచ్చరించింది. ఇప్పుడు మరో సంక్షోభం సృష్టించే దిశగా కిమ్‌ అడుగులు వేస్తున్నాడు. అమెరికా తమను సీరియస్‌గా తీసుకోవాలన్నది కిమ్‌ ఆలోచనగా కనిపిస్తోంది. తమ దగ్గర అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయన్న విషయాన్ని బైడెన్‌ గుర్తించాలని అతను భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు. అసలు ఉత్తరకొరియా లక్ష్యం ఏంటంటే… అణు, క్షిపణి పరీక్షలపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ఎత్తేయాలి. అది జరగలాంటే ముందు అమెరికాతో చర్చలు జరపాలి. అందులో భాగంగానే ఇదంతా చేస్తోంది.

Also read : Imran Khan : ‘పాకిస్థాన్ ముక్కలు కావడం ఖాయం..’ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

దక్షిణి కొరియాతో శాంతి ఒప్పందం, కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా సేనల ఉపసంహరణను కిమ్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దానికోసం తన ఆయుధ శక్తిని వినియోగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అమెరికా దృష్టి తమవైపు తిప్పుకునేందుకు కిమ్‌ ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడో చిక్కుంది. ఇటు నార్త్‌ అటు సౌత్‌ కొరియాలతో చర్చలు జరపడంలో గత అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్నంత ఇంట్రస్ట్‌లో ఒక్క పర్సంట్‌ కూడా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు లేదు. అందులోనూ ఇప్పుడు అమెరికా దృష్టంతా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం మీదే ఉంది. యుక్రెయిన్‌కు సాయం అందించడంలో జో బైడెన్ బిజీగా ఉన్నారు. ఒక వేళ కిమ్‌తో చర్చలు జరిపితే.. రాజకీయంగా కానీ, ఆర్ధికంగా కానీ తమ దేశానికి కానీ పైసా ఉపయోగం లేదన్నది బైడెన్‌ ఆలోచన. అందుకే అలాంటి దేశంపై ఫోకస్ పెట్టడం వల్ల సమయం వృధా తప్ప మరో ఉపయోగం లేదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే చర్చల కోసం కిమ్‌ ఎంతవరకు వెళ్తాడు ? అతని దూకుడు చర్యలు చూస్తూ అమెరికా ఎంతవరకు ఒపిగ్గా ఉంటుందనేది మున్ముందు చూడాలి.