Omicron : డేంజర్ బెల్స్.. వచ్చే రెండు నెలల్లో అత్యంత ప్రబలంగా ఒమిక్రాన్ వ్యాప్తి..!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో..

Omicron : డేంజర్ బెల్స్.. వచ్చే రెండు నెలల్లో అత్యంత ప్రబలంగా ఒమిక్రాన్ వ్యాప్తి..!

Omicron Cases In Country

Omicron : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ మరింతగా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొత్త సంవత్సరం 2022లో తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. పండుగ సమయాల్లో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గతేడాది ప్రపంచాన్ని వణికించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే వేగంగా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. 2022లో యూరప్ లో డెల్టా కంటే డామినెంట్ గా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపనుందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ క్రంటోల్ తెలిపింది.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

కాగా, అమెరికాలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయి. మిగిలిన కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ రకానికి చెందినవి. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ను డామినేట్ చేసే ఆధిపత్య జాతిగా ఒమిక్రాన్ పురోగమిస్తుందని నిపుణులు హెచ్చరించారు.

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. రూపం మార్చుకుని దాడికి సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Cold : జలుబు నివారణ ఇంటి చిట్కాలతో..ఎలాగంటే?

వైరస్‌ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జన సమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురు లేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచించారు.