Omicron: 26దేశాలకు ఒమిక్రాన్.. అమెరికాలో తొలి కేసు.. భారత్‌లోనూ భయం భయం!
ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది.

Omicron: ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. లేటెస్ట్‌గా అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ఓ వ్యక్తిలో ఒమి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈలోనూ ఒమిక్రాన్ తొలి కేసులు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య 26కు పెరిగినట్లు అవుతుంది!
ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తం అయ్యింది. కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షల నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు ప్రకటించింది. అమెరికాకు వచ్చే ప్రయాణికులు జర్నీకి ఒక్కరోజు ముందుగానే వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ గడువు మూడురోజులుగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి, తీసుకున్నవారి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ టెస్టింగ్ విధానంలో మార్పులు చేసేందుకు సీడీసీ యత్నిస్తోందన్నారు డైరెక్టర్ రోచెల్. నూతన నిబంధనలతో వైరస్ నిర్ధరణ పరీక్షల సమయం తగ్గనుందన్నారు. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సురక్షితం చేయాలన్నదానిపై.. క్వారంటైన్ విధానంపైనా సీడీసీ సమీక్షిస్తోందని తెలిపారు.
Omicron Cases: వామ్మో ఒమిక్రాన్.. 21దేశాల్లో వెలుగులోకి కొత్త వేరియంట్!
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ ప్రభావం ఇప్పుడు భారత్‌పైనా పడింది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభ్యం కావడంలేదు. పాస్‌పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో వారు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్ స్థానికంగా వ్యాపించే ముప్పుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్రికా దేశాల నుంచి గత 15రోజుల్లో సుమారు వెయ్యి మంది ముంబైకి చేరుకున్నారు. వీరిలో 466 మందిని గుర్తించి, ఆఫ్రికా దేశాల నుంచి బిహార్‌కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రమాదం పొంచి ఉన్న దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ జాబితాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించిన దేశాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్ స్టైల్లో అమెరికాలోనూ టీ20 లీగ్
- America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్
- Telangana Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
- Vaccine : సబ్ వేరియంట్లపై టీకా ప్రభావం కష్టమే!
- Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?
1NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
2NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
3Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
4CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
5RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
6IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
7Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
8IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
9Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
10Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్