Planet Killers : ప్లానెట్ కిల్లర్స్.. ఫ్రెంచ్ డాక్యుమెంటరీ సిరీస్‌లో హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల

'ప్లానెట్ కిల్లర్స్' వెబ్ సిరీస్‌లో భాగంగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ‘ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్’ అనే ఎపిసోడ్ ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది.(Planet Killers)

Planet Killers : ప్లానెట్ కిల్లర్స్.. ఫ్రెంచ్ డాక్యుమెంటరీ సిరీస్‌లో హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల

Planet Killers : ప్లానెట్ కిల్లర్స్.. ఇదో వెబ్ సిరీస్. ఫ్రాన్స్ టీవీలో ఏప్రిల్ 3 నుంచి ప్రసారం కానుంది. ‘ప్లానెట్ కిల్లర్స్’ వెబ్ సిరీస్‌లో భాగంగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ‘ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్’ ఎపిసోడ్ ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది. ఈ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ సిరీస్‌లో హైదరాబాద్ సీనియర్ జర్నలిస్ట్, బ్లడ్ సాండర్స్ పుస్తక రచయిత సుధాకర్ రెడ్డి ఉడుముల కూడా భాగమయ్యారు. ఎపిసోడ్ లో సుధాకర్ రెడ్డి ఉడుముల కనిపించనున్నారు.

షాహుల్ హమీద్. కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలప స్మగ్లింగ్ కేసులకు సంబంధించి ఇంటర్ పోల్ వెతుకున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్.

Also Read..Timber Plantation : కలప మొక్కల పెంపకంతో అధిక అదాయం

ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్‌ దుబాయ్‌లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్‌ ఎపిసోడ్‌ను ప్యారిస్ కు చెందిన ఇండిపెండెంట్ ప్రొడక్షన్ కంపెనీ, ప్రెస్ ఏజెన్సీ ప్రీమియర్స్ లిగ్నస్ ప్రొడ్యూస్ చేసింది. వెబ్‌ సిరీస్‌లో హమీద్‌, సుధాకర్‌ రెడ్డి పాత్రలు, ఇతర వివరాల్లోకి వెళితే..

హ్యుగో వ్యాన్ అఫెల్.. ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. మార్టిన్ బౌడౌట్ ప్రొడ్యూస్ చేశారు. ప్లానెట్ కిల్లర్స్ లో పర్యావరణ నేరాలను చూపించారు. ఏప్రిల్ 3న రాత్రి 9గంటలకు, 9.50 గంటలకు రెండు డాక్యుమెంటరీలు ప్రసారం కానున్నాయి. ది గాడ్‌ఫాదర్ ఆఫ్ ద ఓషన్స్, ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ద ఫారెస్ట్‌ ఫ్రాన్స్ 5లో ప్రసారం అవుతాయి. france.tvలో రీప్లే కోసం అందుబాటులో ఉంటాయి.(Planet Killers)

Sudhakar Reddy Udumula

”ఇంటర్‌పోల్ రెడ్ లిస్ట్‌లో ఉన్న అగ్రశ్రేణి పర్యావరణ నేరస్తులను మేము గుర్తించాం. ఎర్రచందనం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ కొండల అడవుల్లో లభిస్తుంది. ఇది అరుదైనది, ఖరీదైనది. ఈ కలపతో తయారు చేసిన ఫర్నీచర్‌కు చైనా, జపాన్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది” అని ఫిల్మ్ డైరెక్టర్ హ్యూగో వాన్ ఓఫెల్ అన్నారు.

”ఈ ఎపిసోడ్ రూపొందించడంలో భాగంగా.. ప్రముఖ ఆంగ్ల వార్త పత్రికలో పనిచేస్తున్న భారతీయ పరిశోధనాత్మక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించింది. ఆయన ‘బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్’ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం చాలా ఉపయోగపడింది. ద ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్‌లో, సుధాకర్ రెడ్డి ఉడుముల కథ కూడా ఉంటుంది’ అని ఫిల్మ్ డైరెక్టర్ హ్యూగో వాన్ ఓఫెల్ చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ”మోస్ట్ వాంటెడ్” వెబ్ సిరీస్‌లోని సమంత లెవ్త్‌వైట్: ద వైట్ విడో ఎపిసోడ్‌కు హ్యూగో వాన్ ఓఫెల్ దర్శకత్వం వహించారు.

Director Hugo Van Offel

తమిళనాడులోని అభిరామంకు చెందిన షేక్ దావూద్ షాహుల్ హమీద్.. ఏపీ పోలీస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్. షాహుల్ హామీద్ ఎపిసోడ్ ను హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, చెన్నై, శేషాచలం అడవులు, సింగపూర్, దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ లో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో పాటు అనేకమంది మాజీ పోలీసు అధికారులు, డీఆర్ఐ అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు ప్రకారం.. షాహుల్ హామీద్.. తమిళం, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడగలడు.

Also Read..Agarwood : చెట్లకు సెలైన్ లో విషం పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు !

ఫ్రాన్స్ 5 టీవీ ప్రకారం.. ఆసియాలో, ఎర్రచందనం సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అసాధారణమైన ఫర్నీచర్ లేదా సంగీత వాయిద్యాలను అధిక ధరలకు తయారు చేస్తారు. కానీ ఈ చెట్టు ప్రపంచంలో ఒక ప్రదేశంలో మాత్రమే పెరుగుతుంది. ఆగ్నేయ భారతదేశంలోని శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం పెరుగుతుంది.

స్మగ్లర్లు ఇప్పటికే 95శాతం జాతులను నాశనం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. ప్రధానంగా నిరంతరం వినిపించే పేరు షాహుల్ హమీద్. అతడిని గాడ్ ఫాదర్ ఆఫ్ ట్రాఫిక్ గా పిలుస్తారు.

ఫ్రెంచ్ టీవీ స్టేట్ మెంట్ ప్రకారం.. షాహుల్ హమీద్ కరుడుగట్టిన భారతీయ ఎర్రచందనం స్మగ్లర్. ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. 2016 నుంచి వెతుకుతున్నారు. అతడిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. ఆస్తులు భారీగా కూడబెట్టాడు. హమీద్ సంపద 120 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇండియన్‌ పోలీసులు మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత, షాహుల్ హమీద్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే నేర కార్యకలాపాలు కొనసాగించాడు.

ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, విల్లాలు అతడి సొంతం. హై సెక్యూరిటీలో ఉంటూ నేరాలు కొనసాగించాడు. భారతీయ అడవుల నుంచి దుబాయ్ మీదుగా సింగపూర్ నౌకాశ్రయం మీదుగా తన నేరాలు కొనసాగించాడు. భారతీయ అడవుల నుండి దుబాయ్ మీదుగా సింగపూర్ నౌకాశ్రయం వరకు, అతని వేటలో ఫాంటమ్ కంపెనీలు, అవినీతి కస్టమ్స్ అధికారులు, ప్రభుత్వ సహకారంతో కూడిన అంతర్జాతీయ కలప వ్యాపారం రహస్యాలను వెల్లడిస్తుంది.