Narendra Modi: మోదీని చూసి దగ్గరకు వచ్చి మరీ పలకరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
జపాన్ పర్యటనలో మోదీ పలు దేశాల అధినేతలను కలిశారు.

Narendra Modi
Japan: ప్రధాని నరేంద్ర మోదీ (Modi) జపాన్ లో జీ7 (G7) సదస్సులో పాల్గొన్నారు. భారత్ అతిథి దేశంగా పాల్గొనాలని మోదీని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానించిన విషయం తెలిసిందే. హిరోషిమాలోని జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న మోదీని చూసి, ఆయన వద్దకు వచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). మోదీ-బైడెన్ ఆలింగనం చేసుకున్నారు. కొన్ని క్షణాలు ముచ్చటించారు.
జపాన్ పర్యటనలో మోదీ పలు దేశాల అధినేతలను కలిశారు. ధ్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించారు. నిన్న మోదీ జపాన్ లో ప్రవాస భారతీయులతో కూడా కాసేపు మాట్లాడారు. భారత్ జీ-20కి నేతృత్వం వహిస్తున్న సమయంలోనే మోదీ జీ7 సదస్సుకు హాజరు కావడం గమనార్హం. హిరోషిమాలో మోదీ ఆవిష్కరించి మహాత్మా గాంధీ విగ్రహం అక్కడ శాంతి సందేశంగా నిలవనుంది.
జీ7 సదస్సులో భాగంగా చైనా వైఖరిపై మోదీ పలు దేశాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సులో తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని చైనా కూడా ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పలు దేశాల అధినేతలు జపాన్ లో ఉన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL
— ANI (@ANI) May 20, 2023