Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..

యుక్రెయిన్‌ను తమ హస్తగతం చేసుకొనే వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. సుమారు నాలుగైదు నెలలుగా యుక్రెయిన్‌‌లోని ప్రధాన పట్టణాలపై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మిమ్మల్ని ఏకాకిని చేస్తామంటూ అమెరికా లాంటి అగ్రదేశాలు బెదిరించినా పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..

Putin

Russia-Ukraine War: యుక్రెయిన్‌ను తమ హస్తగతం చేసుకొనే వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. సుమారు నాలుగైదు నెలలుగా యుక్రెయిన్‌‌లోని ప్రధాన పట్టణాలపై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మిమ్మల్ని ఏకాకిని చేస్తామంటూ అమెరికా లాంటి అగ్రదేశాలు బెదిరించినా పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Russia-Ukraine War: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ

యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలను ఇప్పటికే రష్యా తమ ఆదీనంలోకి తెచ్చుకుంది. డాన్ బాస్ లో ఉన్న లుహోన్స్క్ ప్రాంతాన్నిసైతం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

రష్యా సేనలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ అభినందించారు. రక్షణ మంత్రి సెర్గీ షోగూతో కలిసి టీవీలో పుతిన్ సందేశం ఇచ్చారు. లుహాన్క్స్ ప్రాంత ఆక్రమణలో పోరాడిన బలగాలు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండంటూ పుతిన్ సూచించారు. అయితే యుక్రెయిన్ లోని మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్న బలగాలను మాత్రం తమ పనిని కొనసాగించాలని పుతిన్ సూచించారు. ఇప్పటికే యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాలన్నీ నేలమట్టం చేశామని రష్యా ఆర్మీ ప్రకటించింది.