Russia-Meta: రష్యా సంచలనం.. ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సంస్థల మాతృ సంస్థ ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థను తీవ్రవాదా సంస్థల జాబితాలో చేర్చింది.

Russia-Meta: రష్యా సంచలనం.. ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం

Russia-Meta: రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సంస్థలకు మాతృసంస్థ ‘మెటా’.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

మార్క్ జుకెర్‌బర్గ్ ఈ సంస్థల అధినేత. అయితే, మెటా తీవ్రవాద కార్యకలాపాల్లో భాగమైందని రష్యాకు చెందిన కోర్టు ఆరోపించింది. దీంతో ఈ సంస్థను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చుతూ రష్యా మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‪‌లో ఉన్న రష్యన్లపై దాడులు చేసేలా ప్రేరేపించడంలో, తీవ్రవాద కార్యకలాపాల్లో ‘మెటా’కు భాగం ఉందని రష్యా ఆరోపించింది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యన్ వర్గాలు తెలిపాయి. అయితే, రష్యా ఆరోపణలను మెటా సంస్థ తరఫు లాయర్లు ఖండించారు. తాము ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకోలేదని, రష్యన్లకు వ్యతిరేకంగా పనిచేయడం లేదని ఆ సంస్థ తెలిపింది.

Kerala Women: కేరళలో నరబలి.. గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య.. డబ్బు కోసం భార్యాభర్తల దురాగతం

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొంత కాలంగా సైనిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా చర్యను ఖండించాయి. దీంతో రష్యా ఆయా దేశాలకు చెందిన సంస్థలపై నిషేధం విధించింది. దీనిలో భాగంగా గత మార్చిలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి యాప్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.