Russia – PUTIN: ఇదే శాసనం.. 2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగనున్నారు. 2036 వరకు పదవిలో ఉండే చట్టంపై పుతిన్ సోమవారం సంతకం చేశారు. కాగా ప్రస్తుతం పుతిన్ టర్మ్ 2024తో ముగియనుంది.

Russia – PUTIN: ఇదే శాసనం.. 2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతిన్

Putin

Russia – PUTIN: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగనున్నారు. 2036 వరకు పదవిలో ఉండే చట్టంపై పుతిన్ సోమవారం సంతకం చేశారు. కాగా ప్రస్తుతం పుతిన్ టర్మ్ 2024తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త చట్టంతో ఈ టర్మ్ ముగిసిన తర్వాత కూడా మరో రెండు టర్మ్స్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

కాగా ప్రస్తుతం పుతిన్ రెండవసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చట్టంలోని మార్పుల కోసం గతేడాది వేసవిలో ఎన్నికలు నిర్వహించారు. 68 శాతమంది ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఓట్లు వేశారు. ప్రస్తుతం 68 ఏళ్ళు ఉన్న పుతిన్, 83 ఏళ్ళు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

ఇక రష్యా ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని ప్రతిపక్ష పార్టీ పీపుల్స్ అలయన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామిక ఎన్నిక నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పుతిన్ ను వ్యతిరేకిస్తూ పీపుల్స్ అలయన్స్ పార్టీ అధ్యక్షుడు అలెక్సీ నవాల్నీతోపాటు ఆ పార్టీ నేతలు రష్యా వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.

పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది ప్రమాదంగా భావించిన ప్రభుత్వం అలెక్సీ నవాల్నీ జైలులో బంధించింది. అతడిని బయటకు తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు నవాల్నీ పీపుల్స్ అలయన్స్ పార్టీ నాయకులు.