Russia-Pakistan : చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని కోరిన పాక్.. కుదరదని చెప్పిన రష్యా..

చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ 30-40 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రష్యాను కోరింది పాకిస్థాన్. కానీ రష్యా మాత్రం అంగీకరించలేదు. భారత్ కు ఇచ్చినట్లుగా మీకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది రష్యా..దీంతో పాకిస్థాన్ అధికారులు రష్యానుంచి ఏమీ చేయలేక తిరిగి వచ్చేయాల్సి వచ్చింది.

Russia-Pakistan : చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని కోరిన పాక్.. కుదరదని చెప్పిన  రష్యా..

Russia Refuses Pakistan 30-40 percent Discount On Crude Oil

Russia-Pakistan : రష్యా భారత్ మిత్రదేశాలు. అందుకే భారత్ యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం విషయాన్ని సమర్థించటమూ లేదు..అలాగని సమర్థించటమూలేదు. తటస్థంగా ఉండిపోతోంది. ఓటింగ్ విషయాలో కూడా భారత్ దూరంగా ఉండిపోయింది. ఈక్రమంలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవద్దని కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీనికి కారణం రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. అలా భారత్ కు రష్యా భారత్‌కు తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవటంతో భారత్ రూ.35,000 కోట్ల లబ్ధి చేకూరింది. ఇదిలా ఉంటే భారత్ కు తక్కువ ధరకు ఇచ్చినట్లుగానే తమకు కూడా చమురు దిగుమతి చేయాలని పాకిస్థాన్ రష్యాను కోరింది. కానీ రష్యాను పాక్ కు షాక్ ఇచ్చింది.

Russia-Ukraine war.. Indai Benefit : భారత్‌కు కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం .. రష్యా నుంచి చమురు దిగుమతులతో రూ. 35వేల కోట్లు ఆదా

కాగా..రష్యాలో ప్రధాన ఆదాయ వనరుల్లో చమురు ఒకటి.అపారమైన చమురు నిల్వలు రష్యా సొంతం. ఈ చమురు ఎగుమతులతో రష్యా భారీ ఆదాయాన్ని పొందుతోంది. ఈక్రమంలో యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఈయూ దేశాలతో పాటు, పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు దిగుమతులు చేసుకోం అంటూ నిర్ణయించాయి. కానీ భారత్ మాత్రం తన మిత్రదేశమైన రష్యాతో పూర్వపు సత్సంబంధాలనే కొనసాగిస్తూ వస్తోంది. తన చిరకాల మిత్రదేశం భారత్ కు డిస్కౌంట్ పై చమురు అందించడానికి రష్యా ముందుకొచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల భారత్ కు ఖర్చు అత్యంత భారీగా తగ్గింది.

దీంతో..పాకిస్థాన్ కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును పొందేందుకు ప్రయత్నించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యా రాజధాని నవంబర్ 29న మాస్కోకు వెళ్లారు. రష్యా అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భారత్ కు ఇచ్చినట్లుగానే తమకు కూడా 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ తో చమురును సరఫరా చేయాలని కోరింది. కానీ దానికి అంగీకరించలేదు. పాక్ అభ్యర్థనను తిరస్కరించింది రష్యా.దీంతో పాక్ మంత్రి, ఆయన బృందం ఉసూరుమంటూ స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.

Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా