Russia-Ukraine war: రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం ప్రకటించిన అమెరికా

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా మొదటి నుంచి సాంకేతిక, ఆయుధ సాయం చేస్తోన్న విషయం తెలిసిందే.

Russia-Ukraine war: రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం ప్రకటించిన అమెరికా

Russia-Ukraine war

Russia-Ukraine war: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా మొదటి నుంచి సాంకేతిక, ఆయుధ సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. ఉక్రెయిన్ కు 6 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి అమెరికా నిర్ణయం తీసుకుందని ఓ అధికారి తెలిపారు.

ఇందులో భాగంగా 15 స్కాన్ ఈగిల్ డ్రోన్లు, 40 గనుల సంరక్షిత వాహనాలు, ఆకస్మిక దాడుల నిరోధక వాహనాలు, ఇతర ఆయుధాలు ఇస్తుందని చెప్పారు. రష్యాపై ఉక్రెయిన్ పోరాడడానికి అవి ఉపయోగపడతాయని అన్నారు. ఉక్రెయిన్ కు భవిష్యత్తులోనూ ఆయుధ సాయం చేయాలని అమెరికా భావిస్తోందని తెలిపారు. అమెరికా ప్రకటించిన సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. దురాక్రమణను కొనసాగిస్తోన్న దేశాన్ని ఓడించడానికి తాము మరో  అడుగు వేశామని అన్నారు. 2021 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధ సాయం అందించడం ఇది 19వ సారి.

Delhi Excise Policy Case : ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‪కు తెలంగాణతో లింకు.. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్త పేరు