Ukraine Russia Crisis : యుధ్ధం ఎఫెక్ట్-రష్యాకు ఫోన్లు,చిప్‌ల సరఫరా నిలిపివేసిన సామ్‌సంగ్

యుక్రెయిన్‌పై   యుధ్ధం మొదలు పెట్టిన రష్యాకి అంతర్జాతీయ సంస్ధలు ఒక్కోక్కటి తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో త

Ukraine Russia Crisis : యుధ్ధం ఎఫెక్ట్-రష్యాకు ఫోన్లు,చిప్‌ల సరఫరా నిలిపివేసిన సామ్‌సంగ్

Samsung stop products to russia

Ukraine Russia Crisis : యుక్రెయిన్‌పై   యుధ్ధం మొదలు పెట్టిన రష్యాకి అంతర్జాతీయ సంస్ధలు ఒక్కోక్కటి తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

ప్రస్తుతం యుధ్ద వాతావరణం నెలకొన్న   నేపథ్యంలో రష్యాకి   ఫోన్లు, చిప్‌లతో సహా అన్ని ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తునట్లు సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను   బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని తెలిపింది.   అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్  సంస్ధ   తన వినియోగ దారుడిని తొలగించుకున్నట్లు అయ్యింది.

సామ్ సంగ్ కంపెనీ రష్యాలోని కలుగాలో టీవీ ప్రొడక్షన్ ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.  మరోవైపు యుద్ధభూమి యుక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తున్నట్లు సామ్‌సంగ్ వెల్లడించింది.వీటిని ఆ సంస్ధ ఉద్యోగులు స్వఛ్ఛందంగా విరాళంగా అందచేసినట్లు పేర్కోంది.

రష్యా  హాండ్‌సెట్‌ మార్కెట్‌లో సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలో సామ్‌సంగ్‌ 30 శాతం వాటా కలిగి  ఉంది. తర్వాత 23 శాతంలో షావోమి, 13 శాతం వాటాతో యాపిల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్‌తో  పాటు నైక్‌, ఐకియా వంటి సంస్థలు ఇప్పటికే తమ అమ్మకాలను రష్యాకి   నిలిపివేశాయి..

కాగా, హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌లో 44 శాతం వాటా కలిగిన చైనీస్‌ సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాల కొనసాగింపు విషయంలో స్థబ్దుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా సంస్థలు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి.
Also Read :Russia Temporary Ceasefire : మనోళ్లు లేని నగరాల్లోనే యుద్ధానికి బ్రేక్.. సుమిలో భారతీయ విద్యార్థులకు కేంద్రం భరోసా!
రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల నుంచి దక్షిణ కొరియాకు మినహాయింపు లభించడంతో శాంసంగ్ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర కంపెనీల మాదిరిగానే,  రెండు దేశాల మధ్య  యుధ్దం  ముగిసిన తర్వాత  ఇప్పడు విధించిన ఆంక్షలు…  ఇతర ఆర్థిక చర్యలపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత సామ్‌సంగ్  కూడా రష్యాలో విక్రయాలను  తిరిగి  ప్రారంభించే అవకాశం ఉంది.