Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనకారులపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు ఉన్నాయి: ఆదేశ రక్షణశాఖ

అసలే ఆందోళనలతో అట్టుడుకుతున్న ద్వీపదేశంలో..దేశ వ్యాప్త కర్ఫ్యూ ఉండగా..మరోమారు హింస చెలరేగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనకారులపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు ఉన్నాయి: ఆదేశ రక్షణశాఖ

Srilanka

Sri Lanka Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్ధిక సంక్షోభంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తించింది. దేశ వ్యాప్తంగా గత నెల రోజులకు పైగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. శ్రీలంక ప్రధాని పదవికి మహిందా రాజపక్స సోమవారం రాజీనామా చేసినా, రాజపక్స అనుకూలదారులు ఆందోళనకారులపై దాడులకు పాల్పడడంతో మంగళవారం శ్రీలంక దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజపక్స మద్దతుదారులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మృతి చెందగా..భారీగా హింస చెలరేగింది. అసలే ఆందోళనలతో అట్టుడుకుతున్న ద్వీపదేశంలో..దేశ వ్యాప్త కర్ఫ్యూ ఉండగా..మరోమారు హింస చెలరేగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈక్రమంలో అల్లర్లను అణచివేయడానికి శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ ‘షూట్-ఆన్-సైట్’ ఆదేశాలను ప్రకటించింది. ఆందోళనకారులపై “కనిపిస్తే కాల్చివేత” ఆదేశాలు ఉన్నట్లు ఆదేశ రక్షణ మంత్రి పేర్కొన్నారు.

Also read:Liquor Home Delivery: అతి త్వరలో ఇంటికే మద్యం డెలివరీ

మునుపెన్నడూ లేని విధంగా శ్రీలంకలో హింస చెలరేగింది. ఆహారం, ఇంధనం మరియు అత్యవసర మందుల తీవ్రకొరత మరియు దీర్ఘకాలిక విద్యుత్ కోతలు సహా దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి భాద్యత వహిస్తూ మహిందా రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాలనీ పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. చివరకు సోమవారం మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు, కాని అతను రాజీనామా చేసిన వెంటనే దేశంలో భారీగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయా కార్యాలయం వెలుపల ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై రాజపక్స మద్దతుదారులు దాడి చేసిన ఘటనలో సుమారు 173 మంది గాయపడ్డారు తదనంతర హింసాకాండలో అధికార పార్టీ ఎంపీతో సహా మరో నలుగురు మరణించారు.

Also read:Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్‌సర్‌లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు

ప్రజలు రాజపక్స మద్దతుదారులను తరిమికొట్టారు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ మద్దతుదారులపై ప్రజలు దాడి చేశారు. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి రాజధాని కొలంబోలో సైనిక దళాలను మోహరించింది. అయితే ఈ ఘర్షణలన్నిటికి మహింద రాజపక్స భాద్యుణ్ని చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తన రాజీనామా విషయాన్నీ పక్కదారి పట్టించడానికి రాజపక్స తన మద్దతుదారులను నిరసనకారులపై ఉసిగొల్పారని ప్రతిపక్ష నేత ఎంఏ సుమంథిరన్ పేర్కొన్నారు. చివరకు మంగళవారం మహిందా రాజపక్స తన కుటుంబంతో కలిసి తన అధికారిక నివాసం నుండి పారిపోయి ట్రింకోమలీలోని నేవల్ బేస్ క్యాంపులో తలదాచుకున్నాడు.

Also read:Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ