Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్‌సర్‌లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు

మొహాలీలో గ్రెనేడ్ దాడి అనంతరం పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పంజాబ్ లోని అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్‌సర్‌లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు

Punjab

Red Alert in Punjab: పంజాబ్ లోని మొహాలీలో సెక్టార్ 77లో అత్యంత భద్రత కలిగిన భవనంపై జరిగిన ఆర్పీజి గ్రెనేడ్ దాడిలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ఉగ్ర దాడా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం జరిగిన ఈదాడిలో భవనం పాక్షికంగా దెబ్బతినగా..తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రెనేడ్ దాడి ఘటనపై అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు..రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అమృత్‌సర్‌ పోలీస్‌ కమీషనర్‌ అరుణ్‌పాల్‌ సింగ్‌ మంగళవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ నగరంలోని కీలకమైన ప్రాంతాల వద్ద భద్రతను పెంచామన్నారు.

Also read:Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ

ప్రస్తుతం నగరంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రెనేడ్ దాడిపై పంజాబ్ డీజీపీ వీకే భావ్రా..పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొహాలీ జిల్లా పోలీసుల సమక్షంలో నిఘా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించామని..ఘటనపై కొన్ని అధరాలు ఉన్నందున త్వరలో కేసును పరిష్కరిస్తామని డీజీపీ వివరించారు. దాడి వెనుక కుట్ర కోణం ఉందా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిస్తూ..ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఏ విషయాన్ని పూర్తి విచారణ అనంతరం వెల్లడిస్తామని డీజీపీ వీకే భావ్రా అన్నారు.

Also read:Rahul Gandhi: భారత్‌ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు

మొహాలీలో గ్రెనేడ్ దాడి అనంతరం పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడిక్కడే తనిఖీలు చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ భవనం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన జెండాలు ప్రత్యక్షం అయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, పంజాబ్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Also read:Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి